Vignesh Shivan: నయనతార భర్త పై క్రిమినల్ కేస్.. ఏమైందంటే..?

Vignesh Shivan: కోలీవుడ్ డైరెక్టర్ , లేడీ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార భర్త విఘ్నేష్ శివన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాధారణంగా సినిమాలు, కాంట్రవర్సీలు ఈ రెండింటినీ కూడా విడదీసి చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు కాంట్రవర్సీలకు దూరంగా ఉండే సినిమాలకు ఇప్పుడు కాంట్రవర్సీలు అత్యంత కామన్ గా మారిపోయాయి. పాటలు, డైలాగ్స్ సినిమా కథపరమైన అంశాలు ఇలా వివాదాలకు కేరాఫ్ గా మారిన సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా సినిమా టైటిల్స్ కూడా ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా నయనతార భర్త విఘ్నేష్ శివన్ కొత్త చిత్రం ఇలాగే టైటిల్ తోనే కాంట్రవర్సీకి తెరలేపింది.. లవ్ టుడే ఫేమ్..హీరో ప్రదీప్ రంగనాథన్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి టైటిల్ గా ఎల్ఐసి (లవన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) అని కన్ఫామ్ చేశారు. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలయ్యింది.. ఎల్ఐసి ( లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా )తాజాగా చిత్ర బృందం కి నోటీసులు జారీ చేసింది. ప్రజల్లో మంచి పేరు ఉన్న తమ సంస్థను ఇలా సినిమాల కోసం ఉపయోగిస్తే తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలుగుతుందని ఆరోపిస్తూ నోటీసులు జారీ చేసింది. వారంలోపు సినిమా టైటిల్ మార్చకపోతే క్రిమినల్ చర్యలు తప్పవంటూ హెచ్చరించింది. దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇదిలా ఉండగా కాతు వాక్కుల రెండు కాదల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న విఘ్నేష్ కొంచెం గ్యాప్ తర్వాత ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఎల్ఐసి చిత్రాన్ని పూర్తిగా లవ్ అండ్ రొమాంటిక్ జానర్ లో తెరకెక్కిస్తున్నారు. తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ కు జోడిగా కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోందని సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే దర్శకుడు, సంగీత దర్శకుడు కుమారన్ కూడా సినిమా టైటిల్ వివాదం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. 8 సంవత్సరాల క్రితమే తాము ఎల్ఐసి అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్నామని.. ఆ పేరు పూర్తి హక్కులు తమకే ఉన్నాయని తెలిపారు.

- Advertisement -

అయితే ఎల్ఐసి మాత్రం టైటిల్ తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరి టైటిల్ తోనే కాంట్రవర్సీలకు తెరలేపిన ఈ సినిమా మరెన్ని వివాదాలకు కారణమవుతుందో చూడాలి. మొత్తానికైతే ఇప్పుడు టైటిల్ మార్చకపోతే విఘ్నేష్ పై క్రిమినల్ కేస్ నమోదు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి దీనిపై ఎటువంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు