Tollywood: టాప్-10 జాబితాలో నంబర్ వన్ హీరోయిన్ ఎవరంటే..?

Tollywood: సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే హీరోల విషయంలోనే కాదు హీరోయిన్ల విషయంలో కూడా నంబర్ వన్ ఎవరు అనే టాపిక్ ఎప్పటికప్పుడు ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే టాప్ టెన్ హీరోయిన్స్ లో నంబర్ వన్ ఎవరు? 9 మందిని వెనక్కి నెట్టి ముందుకు వచ్చేది ఎవరు? అంటూ ప్రతి ఒక్కరు ఆత్రుతగా తెలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇది ఏ జాబితా కి సంబంధించింది అంటే.. ఇప్పుడు సంక్రాంతి కానుకగా వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎవరు నిలవబోతున్నారు అనే విషయంపై మరింత ఉత్కంఠ నెలకొనింది.

అసలు విషయంలోకి వెళితే జనవరి 12 నుంచి సంక్రాంతి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల జాతర మొదలవుతోంది. మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం, సైంధవ్, నా సామిరంగా, హనుమాన్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి .. గుంటూరు కారం సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి నటిస్తూ ఉండగా.. హనుమాన్ చిత్రంలో అమృత అయ్యర్.. సైంధవ్ లో శ్రద్ధ శ్రీనాథ్ , రుహాని శర్మ , ఆండ్రియా నటిస్తున్నారు. ఇక నా సామిరంగా సినిమాలో కూడా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. వారిలో కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథన్ , మిర్నా మీనన్ , రుక్సార్ థిల్లాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇంతమంది హీరోయిన్లతో థియేటర్లన్నీ కూడా కళకళలాడబోతున్నాయి.

ఇకపోతే ఇప్పటికే శ్రీ లీలా ఫుల్ ఫామ్ లో ఉంది. వరుస విజయాలతో దూసుకుపోతోంది. మీనాక్షి కూడా సక్సెస్ లోనే కనిపిస్తోంది. ఇక వీరిద్దరూ కూడా ఒకే సినిమాతో ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఇక శ్రద్ధ శ్రీనాథ్, రుహాని , ఆండ్రియా కూడా కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు ఇండస్ట్రీలోకి కంబ్యాక్ ఇచ్చారు. ముగ్గురు కూడా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక మిగతా భామలు కూడా అదే ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఇలా ఇంత మంది భామలు ఒకేసారి పోటీ పడుతున్నారు. దీంతో సంక్రాంతి రేసులో నిలిచేది ఎవరు.. టాప్ టెన్ జాబితాలో నెంబర్ వన్ గా ఎవరు నిలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ఈ విషయాలన్నీ తెలియాలి అంటే సంక్రాంతి పండుగకు విడుదల అయ్యే సినిమాల కోసం ఎదురుచూడాల్సిందే.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు