Ram mandir: ఆ సినిమాకి అయోధ్య రామ మందిర్ ప్లస్ కానుందా..?

Ram mandir: శ్రీరాముడి జన్మస్థలం అయిన అయోధ్యలో ఇప్పుడు ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసేలా రామ మందిర నిర్మాణం జరుగుతోంది. హిందూ ప్రజలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ మందిరం జనవరి 22వ తేదీన ప్రారంభించబోతున్న విషయం తెలిసిందే.. ఈ దేవాలయంలో రాముని శిశురూపం రామ్ లల్లా పేరిట రాముల వారి విగ్రహాలను ప్రతిష్టించబోతున్నారు. శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్యని తీర్థ క్షేత్రంగా మార్చడానికి కేంద్రం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇకపోతే 2020ఆగస్టు 5వ తేదీన ఈ రామ మందిరం పనులు మొదలవగా.. మరి కొన్ని రోజుల్లో పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జనవరి 22వ తేదీన రామ మందిరంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం భారతదేశం మొత్తం అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ మూడ్ లో ఉండగా.. ఇప్పుడు చిత్ర పరిశ్రమ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని దర్శక నిర్మాతలు కూడా సినిమాలను ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అయోధ్య రామ మందిరం తాజాగా రాబోతున్న హనుమాన్ చిత్రానికి ప్లస్ కాబోతోంది అని చెప్పడంలో సందేహం లేదు. మొదటిసారి తెలుగు తెరపై సూపర్ హీరో కాన్సెప్ట్ తో హనుమాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే . రియల్ సూపర్ హీరో అంటే అందరికీ హనుమంతుడు గుర్తుకొస్తారు. ఈయన గురించి ఇప్పటివరకు ఒక్క చిత్రం కూడా తెలుగు తెరపై ప్రేక్షకులను అలరించలేదు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు రామ మందిరం ప్రారంభోత్సవం జరుగుతుండగా.. మరొకవైపు రామాయణ ఇతిహాస గాధ లో ఒక ఘట్టం అయిన హనుమంతుడు గురించి చిత్రం రాబోతుండడంతో ప్రజలు కూడా ఈ సినిమా కోసం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఎటువంటి మార్కెట్ లేని యంగ్ హీరో తేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హనుమాన్. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ , గ్లింప్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రూ.60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా రిలీజ్ కి ముందే బ్రేక్ ఈవెన్ సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇందుకు పెద్ద కారణం రామమందిరం అంటూ వార్తలు వైరల్ అవ్వడం గమనార్హం. నిజానికి ఎప్పుడో 8 నెలల క్రితమే విడుదల అవ్వాల్సిన ఈ సినిమా.. దర్శకనిర్మాతలు రామ మందిర ప్రారంభోత్సవాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి వీరి తెలివితేటలకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ రామ మందిరం ప్రారంభోత్సవం కచ్చితంగా ఈ సినిమాకి ప్లస్ అయ్యింది అని చెప్పడంలో సందేహం లేదు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు