Meenakshi Chaudhary : అతిథి పాత్రలో మీనాక్షి… “గుంటూరు కారం” కోసం ఇలాంటి సాహసం

Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి… టాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఈ అమ్మడు. అయితే ఇలాంటి టైంలో ఆమె “గుంటూరు కారం” కోసం చేస్తున్న సాహసమే మీనాక్షి అభిమానులను కలవరపెడుతోంది. సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న “గుంటూరు కారం” మూవీలో మీనాక్షి చౌదరి అతిథి పాత్రలో కనిపించబోతోందా? అనే అనుమానం నిన్నటిదాకా ఉండేది. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు.

నిన్నటి వరకు మీనాక్షి చౌదరి పాత్రకు ఈ మూవీలో పెద్దగా ప్రాధాన్యత లేదు అంటూ ప్రచారం జరిగింది. ఆ వార్తలను నిజం చేసేలా సినిమా ప్రమోషన్స్ లో మీనాక్షి ప్రస్తావన పెద్దగా లేదు. జనవరి 9న గుంటూరులో జరిగిన “గుంటూరు కారం” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు మాట్లాడుతూ ఈ సినిమాలో మీనాక్షి అతిధి పాత్రలో నటిస్తోందని, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అడిగిన వెంటనే ఆమె ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు. దీంతో ఇప్పటిదాకా మీనాక్షి ఆటలో అరటిపండు అని భావిస్తున్న వాళ్ల ఒపీనియన్ నిజమైంది.

మరి ఈ విషయం తెలిసిన తర్వాత మహేష్ బాబు సరసన నటించే అవకాశం దక్కినందుకు సంతోష పడాలా? లేదంటే కేవలం అతిథి పాత్రలో కనిపించబోతున్నందుకు బాధపడాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు మీనాక్షి అభిమానులు. కానీ మీనాక్షి చౌదరి మాత్రం తనకు ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు చాలా సంతోషపడ్డాను అంటూ, త్రివిక్రమ్ పాపులర్ డైలాగ్ ఈ సినిమాలో ఛాన్స్ వచ్చింది అని తెలియగానే జేబులో చేతులు పెట్టుకొని అలా వెళ్ళిపోయాను అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

- Advertisement -

అయితే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి అంకితభావంతో కృషి చేస్తున్న మీనాక్షి ఇలాంటి టైంలో స్క్రీన్ టైం చాలా తక్కువగా ఉన్న అతిథి పాత్రలో కనిపించడం ఆమె కెరీర్ కు రిస్క్ అయ్యే అవకాశం ఉంది. “హిట్ 2” మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మీనాక్షి ఆ తర్వాత “గుంటూరు కారం” మూవీతో స్టార్ హీరోయిన్ రేస్ లోకి వచ్చేసింది. ఈ మూవీ హిట్ అయితే గనక మీనాక్షి స్టార్ హీరోయిన్ గా కెరీర్ టర్న్ అయినట్టేనని భావిస్తున్న ఆమె అభిమానులకు “గుంటూరు కారం” మూవీలో గెస్ట్ రోల్ చేసేందుకు ఒప్పుకొని షాక్ ఇచ్చింది మీనాక్షి. మరి ఈ మూవీ మీనాక్షి కెరీర్ కు ఎలా ఉపయోగపడుతుందో తెలియాలంటే జనవరి 12న “గుంటూరు కారం” మూవీ రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సిందే.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు