Trivikram : హ్యాట్రిక్ ఇస్తాడనుకుంటే ఇద్దర్ని ముంచేసాడు..!

టాలీవుడ్ లో హీరోల రేంజ్ లో పాపులారిటీ సంపాదించిన డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఈయన డైరెక్టర్ కాకముందు నుండే మాటల రచయిత అన్న విషయం తెలిసిందే. ఆ రోజుల్లోనే కేవలం డైలాగ్స్ రాయడానికే ఎన్నో లక్షల రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ ఈయనది. ఈ తరం డైరెక్టర్లకి గురూజీ గా ఫేమస్ అయిన త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన సినిమాల్లో మాటలు తూటాల్లా పేలేవి.

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన సినిమాల్లో చాలా వరకు ఆయన పదునైన డైలాగులతోనే హిట్ అయిన సంధర్బాలున్నాయి. అయితే డైరెక్టర్ గా మారిన త్రివిక్రమ్ గత పదేళ్ల నుండి మాత్రం తన రచనా శైలిలో పట్టును కోల్పోయాడన్నది వాస్తవం. అతడు, జల్సా సినిమాల్లో డైలాగ్స్ ఉన్నట్టు ఇప్పటి సినిమాల్లో అంత పట్టు కనిపించడం లేదు. ఇవన్నీ పక్కన పెడితే త్రివిక్రమ్ లేటెస్ట్ గా దర్శకత్వం వహించిన సినిమా “గుంటూరు కారం”. ఈ సినిమా గురించి త్రివిక్రమ్ మహేష్ ఫ్యాన్సే కాదు, ఆల్ తెలుగు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఎదురుచూసారు.

ఎన్నో భారీ అంచనాలతో జనవరి 12న రిలీజ్ అయిన గుంటూరు కారం ప్రీమియర్స్ నుండే నెగిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అందరూ అనుకున్నట్టుగానే ట్రైలర్ లోనే తేడా కొట్టిన ఈ సినిమా, రిలీజ్ అయ్యాక మరింత నెగిటివ్ రెస్పాన్స్ ని మూటగట్టుకుంది. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ అయితే త్రివిక్రమ్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ప్రీమియర్ చూసిన ఓ ఫ్యాన్ అయితే త్రివిక్రమ్ ఇంటర్వెల్ కే వెళ్ళిపోయాడు కాబట్టి, బతికిపోయాడు, లేదంటే ఫ్యాన్స్ చేతిలో… అంటూ ఆవేశపడుతున్నారు.

- Advertisement -

సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఆరేళ్ళ కిందట ఇంతకన్నా దారుణమైన రిజల్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయం లో జరిగింది. అచ్చం గుంటూరు కారం మాదిరిగానే అప్పట్లో భారీ అంచనాలతో వచ్చింది అజ్ఞాతవాసి. పైగా ఆ సినిమా కూడా వాళ్ళిద్దరి హ్యాట్రిక్ కాంబో లో వచ్చిన సినిమా కావడం విశేషం. ఒక్కసారి అజ్ఞాత వాసి, గుంటూరు కారం సినిమాల్ని కొన్ని విషయాల్ని కంపేర్ చేస్తే… రెండు సినిమాల్లో ఇండస్ట్రీ లో టాప్ పొజిషన్లో ఉన్న హీరోలు, ఆ హీరోలిద్దరితో త్రివిక్రమ్ హ్యాట్రిక్ సినిమా, అన్నిటికి మించి టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్.. రిజల్ట్ గురించి అందరికి తెలిసిందే.

అప్పుడు పవన్ ఫ్యాన్స్ త్రివిక్రమ్ ని ఏ రేంజ్ లో ట్రోల్ చేసారో.. ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ అంతకు మించి గురూజీ పరువు తీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో త్రివిక్రమ్ ఒక చిన్న సినిమా తీసి పరువు నిలుపుకోవాలని చూస్తున్నట్టు టాక్ నడుస్తుంది. అయితే గుంటూరు కారం అజ్ఞాత వాసి రేంజ్ లో మాత్రం ప్లాప్ అవధాని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పండగ అడ్వాంటేజ్ వల్ల సినిమాకి టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వస్తాయని అంటున్నారు. మరి చూడాలి సంక్రాంతి ముగిసే లోగా గుంటూరు కారం ఎలాంటి కలెక్షన్లు వసూళ్లు సాధిస్తుందో.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు