Hrithik Roshan: సినిమాలు ఫ్లాప్.. కానీ రోజుకి రూ.3 లక్షల ఆదాయం.. ఎలా అంటే..?

Hrithik Roshan:  బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. గత కొన్నేళ్ల క్రితం 10 సినిమాలు చేయగా..అందులో రెండు మాత్రమే హిట్ అయ్యాయి.. గతంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈయన గత కొన్నేళ్లుగా పెద్దగా హిట్స్ లేక ఫ్లాప్ సినిమాలతో సరిపెట్టుకుంటున్నాడు. ముఖ్యంగా హిట్ ఫ్లాప్ అంటూ సంబంధం లేకుండా భారీగా సంపాదిస్తున్నారనే చెప్పాలి. అంతేకాదు గత పది సంవత్సరాలలో హృతిక్ రోషన్ ఆస్తులు కూడా భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హృతిక్ రోషన్ సినిమాల విషయానికి వస్తే.. 2014లో వచ్చిన బ్యాంగ్ బ్యాంగ్ సినిమా సెమీ హిట్ గా నిలవగా… ఆ తర్వాత 2016లో మొహంజదారో సినిమా చేశారు. రూ .138 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం రూ.74 కోట్లు మాత్రమే రాబట్టి డిజాస్టర్ గా నిలిచింది.

ఇకపోతే 2017 లో కాబిల్ చిత్రంలో నటించినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇక 2019లో సూపర్ 30 అనే సినిమాలో నటించి.. భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వార్ చిత్రం కూడా కలెక్షన్ల పరంగా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే 2022లో విడుదలైన విక్రం వేదా కూడా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఆయన స్టార్డం కూడా పూర్తిగా తగ్గిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం హృతిక్ రోషన్ వయసు 51 సంవత్సరాలు.. ఈ వయసులో కూడా ఆయన సంపాదన ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.. ముఖ్యంగా 2014 నుంచి హృతిక్ రోషన్ రోజుకి రూ.3.28 లక్షలు సంపాదిస్తున్నారట.. సినిమాలు ఫ్లాప్ అవుతున్న ఈయనకు సంపాదన ఎలా వస్తోంది అని అభిమానుల సైతం ఆరాధిస్తున్నారు.

2020 నాటికి హృతిక్ రోషన్ నికర ఆస్థి విలువ రూ.162 కోట్లు దాటింది. ముఖ్యంగా ముంబైలో విలాసవంతమైన బంగ్లాలు , లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ఇక జుహు ఏరియాలో రూ.100 కోట్లకు పైగా విలువచేసే అపార్ట్మెంట్ కూడా ఉంది. ఇవే కాకుండా ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయట . అలాగే రోల్స్ రాయిస్ ఘోస్ట్ సిరీస్ కారు కూడా ఉన్నట్లు సమాచారం. దీని ఖరీదు రూ.7 కోట్లకు పై మాటే .. వీటితోపాటు బీఎండబ్ల్యూ సహా అనేక లగ్జరీ కార్ లను హృతిక్ రోషన్ తన సొంతం చేసుకున్నారు. ఒక్క సినిమాకి రూ.85 కోట్ల పారితోషకం తీసుకునే ఈయన ఇప్పుడు ఫైటర్, వార్ -3, క్రిష్ 2 వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అయితే ఈయన సినిమాలు ప్లాప్ అవుతున్నా.. ఇతర వ్యాపారాల ద్వారా భారీగా సంపాదిస్తున్నట్లు సమాచారం..

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు