Bigg Boss: హోస్ట్ గా శివాజీ.. నాగ్ లేనట్టేనా..?

Bigg Boss:  తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో 7 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే నెక్స్ట్ సీజన్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా హోస్ట్ గా నాగార్జున సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక సీజన్ 7 లో కంటెస్టెంట్లు కూడా అదిరిపోయే కంటెంట్ ఇచ్చి షో సక్సెస్ అయ్యేలా చేశారు. ఇక పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా శివాజీ టైటిల్ ఫేవర్ గా ప్రచారం అయ్యాడు. కానీ చివరి వారాలలో సమీకరణలు మారి నెగిటివ్ ఎపిసోడ్స్ పడ్డాయి. అదే సమయంలో పల్లవి ప్రశాంత్ రేసులో దూసుకొచ్చారు.

దాంతో శివాజీ , అమర్ దీప్ , పల్లవి ప్రశాంత్ లలో విన్నర్ ఒకరంటూ ప్రచారం రాగా.. అనుకున్నట్లుగానే ఫైనల్లో వీరు ముగ్గురు నిలువగా శివాజీ మూడో స్థానంలో నిలిచాడు.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ టైటిల్ అందుకోగా అమర్దీప్ రన్నర్ గా నిలిచాడు. ఇకపోతే అప్పుడే సీజన్ 8 కి సంబంధించి ఏర్పాట్లు మొదలయ్యాయట. సాధారణంగా జూలై తరువాత బిగ్ బాస్ తెలుగు సీజన్ ఉంటుంది. అయితే ఈసారి మార్చిలోనే షో ప్రారంభం కానుందని సమాచారం. అంతేకాదు ఇప్పటికే కంటెస్టెంట్ ల ఎంపిక కూడా మొదలయ్యిందని సమాచారం. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.

ఈసారి శివాజీ హోస్టుగా చేస్తున్నట్లు సమాచారం.ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ .. బిగ్బాస్ బజ్ కి గీతు రాయల్ హోస్టుగా వ్యవహరించిన విషయం తెలిసిందే. తన మాటలతో ఉత్కంఠ రేపే ప్రశ్నలతో కంటెస్టెంట్లను ఇరుకున పెట్టేసింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఈసారి సీజన్ 8లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్లను దడదడ లాడించడానికి బిగ్బాస్ సీజన్ 8 కి సంబంధించి బిగ్ బాస్ బజ్ కి హోస్ట్ గా చేయడానికి శివాజీ సిద్ధమవుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇక శివాజీ విషయానికి వస్తే షో నుండి బయటకు వచ్చిన తర్వాత బిగ్బాస్ పై ఆరోపణలు చేశాడు.. తనను కావాలనే విలన్ గా చూపించి ఎడిటింగ్ లో తప్పుగా చూపించారని ఆరోపించాడు.. బిగ్ బాస్ టీం లో ఎవరో ఒకరు ఇదంతా చేశారని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు అమర్దీప్ ని లేపారని పరోక్షంగా చెబుతూ అతడికి రన్నర్ అయ్యే అర్హత లేదని కూడా తెలిపారు. అయితే విన్నర్ కంటే రెమ్యునరేషన్ రూపంలో తనకే ఎక్కువ డబ్బులు వచ్చాయని కూడా శివాజీ తెలిపారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు