Avantika: హాలీవుడ్లో అదరగొడుతున్న తెలుగమ్మాయి..!

Avantika Vandanapu:  ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు అవంతిక వందనపు.. మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఎన్నారై తెలుగు అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఈ అమ్మాయి గతంలో పలు యాడ్స్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక ఇప్పుడు హాలీవుడ్ లో కూడా అదరగొట్టేస్తోంది. టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా ఏకంగా హాలీవుడ్ నుంచే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు అమ్మాయి సత్తా ఏంటో నిరూపించే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ..

తాజాగా అవంతిక వందనపు నటించిన హాలీవుడ్ చిత్రం మీన్ గర్ల్స్.. ప్రపంచవ్యాప్తంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమా విడుదలవ్వడమే ఆలస్యం అవంతిక వందనపు ఒకేసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. మీన్ గర్ల్స్ అనే చిత్రంలో కరణ్ శెట్టి అనే క్యారెక్టర్ లో నటించింది అవంతిక . ఈ చిత్రంలో ఈమె నటనకు ప్రశంసలు సైతం కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో అవంతిక చేసిన హాలోవీన్ డాన్స్ అయితే మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇకపోతే అసలు ఎవరు ఈమె అంటూ హాలీవుడ్ ఫ్యాన్స్ కూడా తెగ వెతికేస్తున్నారు. అంతే కాదు ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి అంటూ నెటిజన్లు ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు.

మొత్తానికైతే అవంతిక ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇక అవంతిక 2016లో మహేష్ బాబు చేసిన బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ గా నటించింది . ఆ తర్వాత తెలుగులో ప్రేమమ్ , మనమంతా, రారండోయ్ వేడుక చూద్దాం, ఆక్సిజన్ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక చాలాకాలం తర్వాత ఏకంగా హాలీవుడ్ లోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడంతో ఒక తెలుగు అమ్మాయి టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్లింది అంటూ నెటిజన్ లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు