Naa Saami Ranga : “నా సామి రంగ” ఫస్ట్ డే కలెక్షన్స్… సాలిడ్ ఓపెనింగ్

Naa Saami Ranga : సంక్రాంతిని సెంటిమెంట్ గా భావించి ఈసారి కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్న నాగార్జునకు మళ్ళీ లక్ కలిసి వచ్చింది. “నా సామిరంగ” మూవీ ఫస్ట్ డే డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టింది. మరి ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతవరకు రాబట్టింది అనే వివరాల్లోకి వెళితే…

అక్కినేని నాగార్జున “బంగార్రాజు” మూవీతో గత ఏడాది సంక్రాంతికి తన కెరీర్ లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత “ది గోస్ట్” అంటూ ఈ హీరో చేసిన ప్రయత్నం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేసిన నాగార్జున ఆ డిజాస్టర్ తర్వాత నెక్స్ట్ మూవీ చేయడానికి దాదాపు ఏడాదిన్నర పాటు సమయం తీసుకున్నాడు. ఎట్టకేలకు ఈ సంక్రాంతికి “నా సామి రంగ” అంటూ తనకు కలిసి వచ్చే జోనర్లో, సెంటిమెంట్ గా భావించే పండగ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ అందుకున్నాడు.

కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ మూవీలో కన్నడ భామ ఆషిక రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. యంగ్ హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు. కోనసీమ బ్యాగ్రౌండ్ లో అచ్చమైన సంక్రాంతి మూవీగా రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. హనుమాన్, గుంటూరు కారం, సైంధవ్ వంటి సినిమాలతో గట్టి పోటీ ఉన్నప్పటికీ, ఆ పోటీని తట్టుకుని “నా సామి రంగ” మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టింది.

- Advertisement -

మొదటిరోజు “నా సామి రంగ” మూవీ ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది కోట్లకు పైగా గ్రాస్, నాలుగు కోట్ల 30 లక్షల షేర్ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీస్ వద్ద అదరగొట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. నైజాంలో ఈ మూవీకి మొదటి రోజు కోటి 20 లక్షల వరకు వసూళ్లు దక్కినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ఓవర్సీస్ లో “నా సామి రంగ” మూవీ కోటి వరకు కొల్లగొట్టింది. సీడెడ్ లో 85 లక్షలు, ఈస్ట్ గోదావరి లో 60 లక్షలు, వైజాగ్ లో 50 లక్షల వరకు, వెస్ట్ గోదావరి లో 30 లక్షలు, కృష్ణాలో 23 లక్షల వరకు “నా సామి రంగ” మూవీకి షేర్ కలెక్షన్స్ వచ్చినట్టు సమాచారం.

మొత్తంగా చూసుకుంటే మొదటి రోజు 4 కోట్ల 30 లక్షల వరకు ఈ సినిమా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా “నా సామి రంగ” మూవీ 18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ మూవీకి పాజిటివ్ టాక్ నడుస్తుండడంతో మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో నాగర్జున కెరియర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా “నా సామి రంగ” సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

కిష్టయ్యగా నాగార్జున ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ మాస్ రోల్ లో కనిపించిన విధానం, మాస్ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు డైలాగ్ డెలివరీ, హీరోయిజం, నాగార్జున అల్లరి నరేష్ ల మధ్య ఫ్రెండ్షిప్ సీన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్పీడ్ చూస్తుంటే “నా సామి రంగ” బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను త్వరగానే రీచ్ అయ్యేలా కనిపిస్తోంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు