Varalaxmi Sarathkumar: వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లో గోల్డెన్ లెగ్. తెలుగులో ఆమె నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ముఖ్యంగా ఈమెను సంక్రాంతికి సెంటిమెంట్ గా భావిస్తున్నారు మేకర్స్. ఎందుకంటే ఇటీవల కాలంలో ఆమె నటించిన సంక్రాంతి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. అయితే సినిమా హిట్ కావాలంటే కండిషన్స్ అప్లై అన్నట్టుగా వరలక్ష్మి కేవలం సినిమాలో నటిస్తే సరిపోదు, ఆమె పాత్ర హత్య జరగాల్సిందే. అప్పుడే సినిమాకు వరలక్ష్మి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది.
ఈ తమిళ బ్యూటీ కోలీవుడ్ లో కన్నా టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుకుంటూ ఫుల్ బిజీబిజీగా ఉంటుంది. విలన్, అక్క, సపోర్టింగ్ క్యారెక్టర్ వంటి మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్ లను ఎంచుకుంటూ దూసుకెళ్తోంది వరలక్ష్మి. కొన్నిసార్లు ఈ అమ్మాయి స్క్రీన్ ప్రజెన్స్ తో హీరో హీరోయిన్లను కూడా డామినేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైన “హనుమాన్” మూవీలో ప్రేక్షకులు మరిచిపోలేని పాత్రను పోషించింది వరలక్ష్మి. బ్లాక్ బస్టర్ టాక్ తో మంచి కలెక్షన్లను కొల్లగొడుతున్న ఈ సినిమాలో హీరో తేజ సజ్జాకు అక్కగా కనిపించిన వరలక్ష్మి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
అయితే ప్రీ క్లైమాక్స్ కి ముందే వరలక్ష్మి పాత్ర విలన్ వినయ్ రాయ్ చేతిలో హత్యకు గురయ్యే సీన్ తో “హనుమాన్” లో ఎమోషన్ పీక్స్ లోకి వెళ్ళింది. ఇక ఈ బ్యూటీ నటించిన గత సంక్రాంతి సినిమాలలో కూడా ఆమె పాత్ర చనిపోతుంది. చనిపోతుంది అనడం కన్నా ఒక సినిమాలో ఆత్మహత్య చేసుకుంటుంది, మరొక సినిమాలో హత్య చేస్తారు అనడం సబబేమో.
2023లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన నందమూరి బాలకృష్ణ “వీర సింహారెడ్డి” సినిమాలోని వరలక్ష్మి కీలక పాత్రను పోషించింది. ఈ సినిమాలో బాలయ్య మొండి చెల్లెలుగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. తాను ప్రేమించిన వాడిని తన సొంత అన్నయ్య మట్టు పెట్టాడనీ అపార్థం చేసుకున్న చెల్లెలు అతనిపై పగ పెంచుకుంటుంది. చివరకు తన అన్నయ్యను విలన్ల సహాయంతో అంతం చేశాక అసలు నిజం తెలుసుకుని తాను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా చివరకు ఆత్మహత్య చేసుకునే సోదరిగా వరలక్ష్మి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఈ సినిమా కంటే ముందు “క్రాక్” మూవీలో విలన్ గా జయమ్మ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించి ప్రేక్షకులకు మెంటలెక్కించింది. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాలో విలన్ సముద్రఖని పక్కనే ఉంటూ చివరికి అతని వల్లే హతమయ్యే జయమ్మగా ఆమె పోషించిన పాత్ర మరువలేనిది. అయితే వరుసగా సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమాలకు బలమైన పాత్రలు పోషించిన వరలక్ష్మి ప్లస్ పాయింట్ గా మారింది. అలాగే ఆమె పాత్ర హత్య కూడా అనివార్యం అయింది. మరి నెక్స్ట్ వరలక్ష్మి చేయబోయే అన్ని సినిమాలకు కూడా ఇదే సెంటిమెంట్ ను ఫాలో అవుతారా లేదంటే దాన్ని బ్రేక్ చేస్తారా అనేది చూడాలి.
Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.