Personality Development: ఈ పనుల కోసం టైం, ఎనర్జీని వేస్ట్ చేస్తే లైఫ్ లో ఎదగలేరు?

జీవితంలో సక్సెస్ ఫుల్ గా ఎదగడానికి అవసరమైన వాటిలో సమయం, శక్తి అత్యంత విలువైనవి. కానీ ఈ డిజిటల్ యుగంలో లెక్కలేనన్ని పరధ్యానాలతో అత్యంత ముఖ్యమైన సమయాన్ని, శక్తినీ వేస్ట్ చేస్తూ ఉంటాము. పైగా సరైన అవగాహన లేకపోవడం వల్ల మనకు తెలియకుండానే అనవసరమైన విషయాలపై ఎక్కువ సమయాన్ని, శక్తిని పెట్టేసి తర్వాత బాధపడతాం. మరి ఎలాంటి పనుల కోసం ఆ రెండింటినీ వేస్ట్ చేయకుండా ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ప్రాధాన్యత లేని పనులకు కమిట్ అవ్వడం వలన టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇంపార్టెన్స్ ఇస్తున్న పనులు మీ ప్రైమరీ గోల్స్ కు నిజంగా దోహదపడతాయా? ఇప్పటినుంచి ఆరు నెలలు లేదా ఒక సంవత్సరం తర్వాత అది ముఖ్యమా? ఈ పనిని మీకన్నా మెరుగ్గా ఇంకెవరైనా చేయగలరా? అనే విషయాలను ఆలోచించుకోండి. అనవసరమైన ప్రశ్నలు వచ్చినప్పుడు నో చెప్పడం నేర్చుకోండి. కమిట్ అయ్యే ముందు సరైన ప్రశ్నలను అడగండి.

2. ప్రతిరోజూ చేసే పనులను పర్ఫెక్ట్ గా చేయడానికి సమయాన్ని వేస్ట్ చేయడం వల్ల నష్టమే తప్ప లాభం ఉండదు. కాబట్టి రొటీన్ టాస్క్ ల కోసం శక్తిని వేస్ట్ చేసుకోకండి.

- Advertisement -

3. గత తప్పుల గురించి ఆలోచించడం అనేది మీ మైండ్ లో నెగెటివిటీని పెంచుతుంది. కానీ అది పైకి కనిపించదు. గత పొరపాట్ల గురించి ఆలోచిస్తూ ఉండటం వల్ల మనకు తెలియకుండానే కోపం, విచారం పెరిగిపోతాయి. దానివల్ల ప్రజెంట్ చేయాల్సిన పనులపై ఎఫెక్ట్ పడుతుంది. ధ్యానం చేయడం వల్ల ఈ నెగెటివిటీ తగ్గే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు ఎప్పుడైనా గత తప్పిదాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు అనిపిస్తే గట్టిగా ఊపిరి పీల్చుకుని, నెమ్మదిగా వదులుతూ ధ్యానం చేయండి.

4. అందరినీ మెప్పించడానికి ప్రయత్నించడం అనేది వృధా ప్రయత్నం. ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికీ నచ్చరు. కాబట్టి ఇలాంటి ఆలోచన ఉంటే మానుకోండి. ఇతరులను సంతోష పెట్టడానికి మీరు వెచ్చించే టైం, శక్తి రెండు వేస్ట్ అవుతాయి. కొందరు వ్యక్తులు మీతో కనెక్ట్ కాకపోతే ఫీల్ అవ్వడం పక్కన పెట్టేసి రిజెక్ట్ చేసినప్పుడు యాక్సెప్ట్ చేసే విధంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. అవతలి వ్యక్తి అభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నించడం కన్నా మీరు చెప్పాలనుకున్న విషయాన్ని వాళ్లకు సూటిగా చెప్పేయండి. ఆ తర్వాత ఫలితాన్ని వాళ్ళకే వదిలేయండి.

5. మీ చేతుల్లో లేని విషయాల గురించి ఆందోళన చెందడం అనేది అర్థం లేనిది. ఇలా టెన్షన్ పడితే మానసికంగా కృంగిపోయినట్టు, నిస్సహాయంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. కాబట్టి మీ నియంత్రణలో లేని పనుల ఫలితం బాధ్యతను కాలానికే వదిలేయండి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు