Rashmika: రష్మిక తో పెళ్లి.. నిజం చెప్పేసిన రౌడీ హీరో..!!

Rashmika: ఏ ఇండస్ట్రీలో నైనా నటీనటుల మధ్య రూమర్స్ కామన్ గా వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పలు సందర్భాలలో ఎఫైర్స్ గురించి కూడా ఎన్నో వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. హీరో హీరోయిన్ ఏదైనా రెండు మూడు సినిమాలలో కలిసి నటించారంటే కచ్చితంగా వీరి మధ్య ఏదో ఉందంటూ.. త్వరలో వివాహం చేసుకోబోతున్నారంటూ పలు రకాల రూమర్స్ సృష్టిస్తూనే ఉంటారు ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి రూమర్స్ ని ఎదుర్కొంటున్న వారిలో విజయ్ దేవరకొండ, రష్మిక కూడా ఉన్నారు..

గత కొన్నేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరి ఎంగేజ్మెంట్ జరగబోతుందనే వార్తలు కూడా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ విషయం పై విజయ్ టీం స్పందించింది.. విజయ్ దేవరకొండ టీం స్పందిస్తూ ఈ విషయంలో ఎలాంటి వాస్తవం లేదని చెప్పగా.. తాజాగా విజయ్ సహితం ఈ రూమర్స్ ని ఖండించారంటూ తెలియజేశారు.. ఒక మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసిన విజయ్.. అనంతరం వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని తెలియజేశారు. ఇందులో భాగంగానే రష్మిక తో ఎంగేజ్మెంట్ గురించి అసలు నిజాన్ని చెప్పేసినట్లు తెలుస్తోంది.

ఫిబ్రవరిలో రష్మికతో ఎంగేజ్మెంట్ అని వస్తున్న వార్తలలో అసలు నిజం లేదని.. ఫిబ్రవరిలో తనకు ఎలాంటి పెళ్లి కానీ , నిశ్చితార్థం కానీ జరగడం లేదని.. ఈ మీడియా వారు ప్రతి ఏడాది తనకు పెళ్లి చేయాలని చూస్తున్నారని.. అందుకే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారని తెలిపారు.. దీంతో ఈ రూమర్స్ కి చెక్ పడిందని విజయ్ దేవరకొండ అభిమానులు తెలుపుతున్నారు. రష్మిక, విజయ్ ప్రస్తుతం వారి వారి కెరియర్ లో చాలా బిజీగా ఉన్నారు.

- Advertisement -

రష్మిక ఇటీవలే యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో భారీ క్రేజ్ ని అందుకుంది. టాలీవుడ్ లో ప్రస్తుతం పుష్ప-2 సినిమాలో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు.. ఈ సినిమా ఈ ఏడాది విడుదలకు సిద్ధంగా ఉంది.. అయితే అభిమానులు మాత్రం వీరిని జంటగా చూడాలని కోరుతున్నట్లు ఎన్నో సందర్భాలలో తెలియజేయడం జరిగింది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు