AllariNaresh: హీరోగా అల్లరి నరేష్ కెరియర్ పతనమైనట్టేనా..?

AllariNaresh: ఈమధ్య చాలామంది నటీనటులు ఒక సక్సెస్ అందుకొని గుర్తింపు సంపాదించుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతున్నారు. గతంలో ఎన్నో కామెడీ చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న అల్లరి నరేష్ ఈ మధ్యకాలంలో విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నప్పటికీ అంతంతమాత్రంగానే ఆకట్టుకుంటున్నారు. సోలో హీరో గానే కాకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా కీలకమైన పాత్రలలో నటిస్తూ బిజీగా గడిపేస్తున్నారు అల్లరి నరేష్.. ఇకపోతే నాంది సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టి మంచి విజయాన్ని అందుకున్నారు.

ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం నరేష్ కు పెద్దగా సక్సెస్ ని అందించలేకపోయాయి. దీంతో మరొకసారి మార్కెట్ డౌన్ అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్గా నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగ సినిమాలో ఒక ఇంపార్టెంట్ పాత్రలో నటించారు. సినిమా అయితే సక్సెస్ అయింది కానీ నరేష్ కి మాత్రం గుర్తింపు రాలేదని చెప్పవచ్చు.. వాస్తవానికి ఇతర హీరోల సినిమాలలో నరేష్ చేస్తే ఆ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి కానీ సోలో హీరోగా మాత్రం సినిమాలతో మెప్పించలేకపోతున్నారు. ఈ విషయంలో అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..

అల్లరి నరేష్ లాంటి నటుడు మంచి టాలెంట్ ఉన్న నటుడు అయినా సరే మంచి కంటెంట్ ఉన్న స్టోరీలు ఈయనతో చేయడానికి దర్శక నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సమాచారం.. ఈయన తీసే సినిమాలలో కంటెంట్ లేకపోవడం వల్లే ఆ ఎఫెక్ట్ సినిమాలపై పడుతోందనే అందుకే అల్లరి నరేష్ సినిమా కెరియర్ పతనం అయిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మీదట అల్లరి నరేష్ ఇండస్ట్రీలో కొనసాగాలంటే మాత్రం సరైన కథలతో విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంటుందని ట్రెండ్ పండితులు తెలుపుతున్నారు.

- Advertisement -

ఇకపోతే స్టార్ హీరోల చిత్రాలలో ఇతరత్రా క్యారెక్టర్లలో నటిస్తే అవకాశాలు అందుకొని చేయవలసి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం అల్లరి నరేష్ కెరీర్ కాస్త డేంజర్ జోన్ లోనే ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ ఇలాగే అల్లరి నరేష్ కెరియర్ కొనసాగితే మరో అయిదారేళ్లలో అల్లరి నరేష్ కెరీర్ పతనానికి కారణమవుతుందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు