V.K.Naresh: అందుకే టెన్త్ ఫెయిల్ అయ్యా – సీక్రెట్ అదే అంటున్న నరేష్..!

V.K.Naresh:  టాలీవుడ్ లో తన నటనతో , కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించగలిగిన నటులలో నటుడు వీకే నరేష్ కూడా ఒకరు.. సినీ రంగ ప్రవేశం చేసి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.. పండంటి కాపురంలో మొదటిసారిగా బాల నటుడుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత హీరోగా విలన్ గా ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి మెప్పించారు వీకే నరేష్.. ఈయన తల్లి విజయనిర్మల కూడా హీరోయిన్ గా, నిర్మాతగా , దర్శకురాలుగా రాణించారు.

ఇంతటి సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నరేష్.. ఈ రోజు పుట్టినరోజు కావడం తో ఈయనకు సంబంధించిన పది విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తన సినీ ప్రస్థానం 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేష్ నిన్నటి రోజున విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను సైతం తెలియజేశారు.. ఈ సమావేశంలో తన తల్లితో ఉన్న అనుబంధాన్ని కూడా గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు.. బాల్యం నుంచి తాను ఇప్పటివరకు సినీ పరిశ్రమలో కొనసాగిన విషయం పైన తెలియజేస్తూ నటుడుగా ప్రతి అవకాశాన్ని తాను సద్వినియోగం చేసుకొని.. ఇప్పటికీ 50 ఏళ్లు సినీ ప్రస్తానాన్ని పూర్తి చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.

అయితే ఇదంతా కేవలం ప్రేక్షకుల ప్రేమాభిమానాలతోనే సాధ్యమైందని.. తన చివరి శ్వాస వరకు సినీ ఇండస్ట్రీకి సేవలు అందిస్తానంటూ తెలిపారు.. తనకి ఊహ తెలిసినప్పటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ , తన తల్లి విజయనిర్మల మేకప్ రూమ్, స్టూడియో వాతావరణం చుట్టూనే పెరిగానని.. నాటితరం నేటితరంతో పోటీపడుతూ నటిస్తున్నానని తెలిపారు.. సినీ ఎంట్రీ పై నరేష్ ఇలా మాట్లాడుతూ పండంటి కాపురం సినిమాలో తన నటన మొదలయ్యిందని.. బాలనటులుగా వచ్చి చాలామంది హీరోలు విజయం కాలేరని, అలాంటి భయం తనకు కూడా ఉండేదని.. కానీ దాని గురించి పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు..

- Advertisement -

ఒక్క సినిమాలోనైనా హీరోగా నటిస్తే చాలనుకున్నాను.. అయితే సినిమాలలోకి ఎలా వచ్చానని రహస్యాన్ని కూడా తెలియజేస్తానని తెలిపారు.. సినిమాల మీద నటించాలనే మక్కువతో పదవ తరగతి పరీక్షలు కూడా ఫెయిలయ్యాను.. ఆ తర్వాత రెండు మూడు సినిమాలలో నటించాను .కానీ జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన నాలుగు స్తంభాల ఆట సినిమా నా కెరియర్ కి బాగా కలిసి వచ్చిందని తెలిపారు.నా కెరియర్ లో అమ్మ, విశ్వనాథ్ , బాపు, రమణ, ఈవీవీ సత్యనారాయణ, రేలంగి తదితర మహనీయులతో నటించడం చాలా అదృష్టమని తెలిపారు.

నటుడుగా పదేళ్లు ఉండడమే గొప్ప అనుకుంటున్న ఇండస్ట్రీలో 50 ఏళ్లు గడపడం చాలా ఆనందంగా ఉందని చెబుతూనే.. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మలను కోల్పోవడం పై కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు వీకే నరేష్. వీరిద్దరు పోయిన బాధ నుంచి బయటపడడానికి కొన్ని నెలలు పట్టిందని తెలిపారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు