Allu Arjun : పుష్ప 2 టీంకు షాక్‌..బన్నీ కారణంగా సినిమాకు బ్రేక్‌?

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటన, డ్యాన్స్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు. సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఫ్యామిలీతో సరిగ్గా సమయాన్ని గడపలేకపోతారు చాలామంది హీరోలు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా తన కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోయినప్పటికీ…. తనకు సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబంతో కాస్త సమయాన్ని గడుపుతూ కేటాయిస్తాడు.

అంతేకాకుండా బయటకి ఎక్కడికి వెళ్ళినా తన భార్య స్నేహ రెడ్డిని వెంట తీసుకొని వెళ్తూ ఉంటాడు అల్లు అర్జున్. స్నేహ కూడా బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటూ చాలా బిజీగానే ఉంటుంది. స్నేహ రెడ్డి స్థాపించిన పికాబూ సంస్థని గురించి అందరికీ తెలిసిందే. ఈ సంస్థ తాజాగా కండక్ట్ చేసినా ఓ ఈవెంట్ కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చాడు. ఈ క్రమంలోనే మాట్లాడుతూ పుష్ప సినిమా షూటింగ్ మధ్యలో నుంచి నేను ఇక్కడికి వచ్చానని చెప్పుకొచ్చాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. తాను ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన భార్య కోరిక మేరకు అక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది.

ఎంతటి హీరో అయినా సరే నేను తాను కూడా ఓ ఫ్యామిలీ మెన్ అనిపించుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా స్నేహారెడ్డి మాట్లాడుతూ…. కొన్ని సంవత్సరాల క్రితం తాను ఈ సంస్థని స్థాపించానని…. కిడ్స్ ఫోటోగ్రఫీ చేస్తున్నామని తెలిపింది. ఇందులో తనకి తన చెల్లెలు ఎంతో సపోర్ట్ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. తన చెల్లెలు అంటే తనకు ఎంతో ఇష్టమని, ఎప్పుడూ కలుస్తూ ఉంటామని, ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకుంటాం అంటూ స్నేహరెడ్డి చెప్పారు. అంతేకాకుండా…తాను ఏది చేస్తానన్న అల్లు అర్జున్ అసలు కాదనడని, తనకు ఎంతగానో సపోర్ట్ చేస్తాడు అంటూ చెప్పుకొచ్చింది. నన్ను ఇంట్లో ఎప్పుడూ ఏదైనా చేయమని ప్రోత్సహిస్తూనే ఉంటాడు. తన సపోర్ట్ తోనే నేను ఏదైనా చేయగలుగుతున్నానని స్నేహ చెప్పుకొచ్చింది. ఇక ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు