Eagle Movie: రంగంలోకి ఫిల్మ్ ఛాంబర్… నిర్మాతలకు పర్సనల్‌గా లెటర్స్

Eagle Movie: మొన్నటి సంక్రాంతి బరిలో దిల్ రాజ్, ఫిల్మ్ ఛాంబర్ కోరిక మేరకు రిలీజ్ డేట్ మార్చుకున్న మూవీ ఈగల్. సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, నిర్మాతల కోరిక మేరకు ఫిబ్రవరి 09కి వాయిదా పడింది. అయితే తమ సినిమాను వాయిదా వేసుకోవడానికి ముందు ఫిల్మ్ ఛాంబర్ నుంచి సోలో రిలీజ్ మాట తీసుకున్న సంగతి తెలిసిందే.

సోల్ రిలీజ్ మాట కోసం నాగ వంశీ తన ప్రొడక్షన్ లో వస్తున్న డీజే టిల్లును వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు ఫిబ్రవరి 09న ఈగల్ తో పాటు ఊరు పేరు భైరవకోన, యాత్ర 2, లాల్ సలాం సినిమాలు ఉన్నాయి. అంటే మొత్తం నాలుగు సినిమాలో బాక్సాఫీస్ వద్దకు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సోలో రిలీజ్ మాట ఇచ్చారు.. దాన్ని నిలబెట్టుకోవాలి అంటూ ఈగల్ ప్రొడ్యూసర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్లు ఫిల్మ్ ఛాంబర్ కు ఇటీవల ఓ లెటర్ రాసిన సంగతి తెలిసిందే.

ఈ లెటర్ వచ్చిన నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి 09న రిలీజ్ కాబోతున్న ఊరు పేరు భైరవకోన, యాత్ర 2, లాల్ సలాం సినిమాల నిర్మాతలకు ఫిల్మ్ ఛాంబర్ నుంచి పర్సనల్ గా లెటర్ రాసి పంపినట్టు తెలుస్తుంది. తాము తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి, ఈగల్ మూవీకి సోలో రిలీజ్ కు సహకరించాలని ఆయా నిర్మాతలను లేఖలో కోరారట.

- Advertisement -

అలాగే… ఫిబ్రవరి 09న కాకుండా, ఒక రోజు ముందుకు గానీ, ఒక రోజు తర్వాత గానీ రిలీజ్ డేట్ ను మార్చుకోవాలని లేఖలో సూచించారని సమాచారం. దీనికి యాత్ర 2 దాదాపు అంగీకరించిందని టాక్. అయితే ఊరు పేరు భైరవకోన, లాల్ సలాం సినిమాల నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రిప్లే రాలేదని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి.

కాగా, తమకు ఫిబ్రవరి 09 తప్పా మరే డేట్ కలిసి రాదని, తాము ఫిబ్రవరి 09కే ఫిక్స్ అయ్యామని ఇప్పటికే ఊరు పేరు భైరవకోన మూవీ మేకర్స్ బహిరంగంగానే చెప్పిన సంగతి తెలిసిందే.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు