Raviteja: భద్ర మూవీ టైమ్ లో బోయపాటి గొడవ.. కారణం..?

Raviteja: మాస్ మహారాజా రవితేజ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన చిత్రం భద్ర. ఈ సినిమా రవితేజకు మంచి పేరు తీసుకొచ్చిందని చెప్పాలి. ఇందులో రవితేజ కామెడీ టైమింగ్ కి అభిమానులు ఫిదా అయ్యారు. అంతేకాదు బోయపాటి దర్శకుడిగా ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఫైట్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలతో.. మాస్ ఎలివేషన్స్ సినిమా తీయాలంటే బోయపాటి ఉండాల్సిందే అన్నంతగా తన మార్క్ సృష్టించుకున్నారు.

ఇకపోతే ఇటీవల స్కంద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు అని చెప్పాలి. ఇదిలా ఉండగా బోయపాటి సినిమాలలో సాధారణ ఫైట్స్ కంటే కూడా మితిమీరిన, నమ్మశక్యంగాని రేంజ్‌లో భారీ ఫైట్స్ ఉంటాయి. తన హీరోలు ఎవరైనా షూటింగ్లో ప్రమాదానికి గురైతే తానే డూప్ గా రంగంలోకి దిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే భద్ర సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ వంశీ పైడిపల్లితో బోయపాటి గొడవకు దిగడం ఇప్పుడు పలు అనుమానాలకు దారి తీస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. భద్ర సినిమా బోయపాటికి మొదటిది. దీనికి వంశీ పైడిపల్లి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

వాస్తవానికి దిల్ రాజు దగ్గర మొదట ఫైనాన్షియర్ గా పనిచేసిన వంశీ పైడిపల్లి.. తాను కూడా ఒక సినిమాకి దర్శకత్వం వహించాలని అనుకున్నాడు. అప్పుడు దిల్ రాజు మొదట బోయపాటి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయమని చెప్పారట. దాంతో ప్రతిరోజు బోయపాటి ఎలా సినిమా తీస్తున్నాడు అనే విషయాన్ని దగ్గరుండి మరీ వంశీ చూసి నేర్చుకున్నారు. ఇక అంతా బాగానే ఉన్నా ఒకరోజు షూటింగ్ జరుగుతున్న సమయంలో ఒక సీన్ బాగానే వచ్చింది అని కట్ చెప్పారట బోయపాటి. కానీ వంశీ మాత్రం అస్సలు బాగాలేదని మరోసారి తీయాలని సూచించాడట. దాంతో బోయపాటికి కోపం వచ్చి డైరెక్టర్ నువ్వా నేనా అంటూ వంశీతో గొడవ పడ్డారట.

- Advertisement -

ఇదే విషయాన్ని ధనరాజ్‌తో సహా చెప్పారట.. వంశీ దూకుడు తగ్గించుకుంటే మంచిదని లేదంటే సినిమా తీయడం కష్టమవుతుందని.. వంశీ కాస్త పక్కకు ఉంటే తన సినిమా తాను పూర్తి చేసుకుంటానని దిల్ రాజుతో గొడవపడ్డారట. ఇక తర్వాత దిల్ రాజు కూడా వంశీకి చెప్పడంతో ఆ తర్వాత బోయపాటి విషయంలో జోక్యం చేసుకోలేదని సమాచారం. ఇక ఇలా కొన్ని గొడవల మధ్య విడుదలైన ఈ సినిమా అటు బోయపాటికి ఇటు రవితేజకు మంచి గుర్తింపును అందించిందని చెప్పవచ్చు

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు