Kamal Haasan : డైరెక్టర్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిన కమల్… KH233 ఇక షెడ్డుకే

Kamal Haasan : లోక నాయకుడు కమల్ హాసన్ లైనప్ చూస్తే కుర్ర హీరోలకు అసూయ పుట్టడం ఖాయం. వరుస డిజాస్టర్లు అందుకున్న తర్వాత “విక్రమ్” సినిమాతో తన కెరీర్ లోనే అతిపెద్ద సక్సెస్ ను అందుకున్న కమల్ హాసన్ అదే జోష్ తో వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలోనే డైరెక్టర్ హెచ్ వినోద్ కి ఆయన కోలుకోలేని షాక్ ఇచ్చారు. కమల్, వినోద్ కాంబినేషన్లో రావలసిన సినిమా KH 233 ఆగిపోయినట్టు తెలుస్తోంది.

“విక్రమ్”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కమల్ హాసన్ ఆ తర్వాత మణిరత్నంతో “థగ్ లైఫ్”, శంకర్ తో “ఇండియన్ 2, 3” వంటి పెద్ద ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు. అదే క్రమంలో డైరెక్టర్ హెచ్ వినోద్ తో కూడా ఒక చిత్రాన్ని ప్రకటించారు. ఒకవైపు కమల్ తన సినిమాలతో బిజీగా ఉంటే, మరోవైపు వినోద్ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో కలిసి “తునివు”, తెలుగులో “తెగింపు” అనే సినిమాను చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక డైరెక్టర్ వినోద్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కమల్ హాసన్ తో చేయాల్సి ఉంది.

ఈ మేరకు చాలా కాలం క్రితమే అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. కానీ అనేక కారణాలవల్ల KH 233 సినిమా ఇప్పటిదాకా పట్టాలెక్కలేదు. కమల్ ప్రస్తుతం ఇండియన్ 2, కల్కి 2898AD, థగ్ లైఫ్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దాంతో “ఖాకీ” ఫేమ్ వినోద్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని తెలుస్తోంది.

- Advertisement -

హెచ్ వినోద్ దర్శకత్వంలో వచ్చిన “తెగింపు” సినిమా ఫలితం కారణంగా ఆయనతో సినిమా చేయడానికి కమల్ ఆసక్తి చూపడం లేదని, అందుకే ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసి గట్టి షాక్ ఇచ్చాడని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. కానీ ఈ ప్రాజెక్టు కోసం వినోద్ చాలా కాలం ఎదురు చూశాడు. ఎన్నో ఆశలు పెట్టుకుని, చాలా టైం వృధా చేసుకున్న వినోద్ కు KH 233 ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం నిజంగానే తీవ్ర నిరాశను కలిగించే విషయం. ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టి ధనుష్ తో కొత్త చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడట ఆయన. ఈ మూవీ 2024 వేసవిలో సెట్స్ పైకి వెళ్ళబోతుందని టాక్ వినిపిస్తుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు