K.R. Vijaya: కె ఆర్ విజయ గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?

K.R. Vijaya: తెలుగులో భారీ పాపులారిటీ దక్కించుకున్న అలనాటి నటీమణులలో కె ఆర్ విజయ కూడా ఒకరు. ఈతరం ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సింహా సినిమాలో కీలక పాత్ర పోషించిన కె.ఆర్ విజయ.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించారు. అలాగే బాలయ్య శ్రీరామరాజ్యంలో కూడా ఈమె నటించారు. కాగా విజయ ఎక్కువగా భక్తి ప్రాధాన్యత గల చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కేఎస్ గోపాలకృష్ణన్ దర్శకత్వంలో 1963 నవంబర్లో కర్పగం అనే తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. తన సినీ కెరియర్లో 500 కు పైగా చిత్రాలలో నటించి, ఆడియన్స్‌ను మెప్పించారు

మొదట్లో చెన్నైలోని టీ నగర్ లో నివసించిన కే ఆర్ విజయ.. భర్త చనిపోయిన తర్వాత కేరళలో ఉంటున్నారు. ఇక ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 1948 నవంబర్ 30న కేరళలో జన్మించారు. విజయ తల్లి కళ్యాణి కూడా కేరళకు చెందినవారు. కాగా ఈమె తండ్రి రామచంద్రన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరుకు చెందినవారు. బాల్యమంతా తమిళనాడులోని పళని లో గడిచింది. ఈమె సోదరి కూతురు అనూష హీరోయిన్ గా నటించింది. 1960, 70 లలో తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటిగా రాణించిన కే ఆర్ విజయ.. ఎంజీఆర్, జయశంకర్, శివాజీ గణేషన్ , జెమినీ గణేషన్ వంటి ప్రముఖ నటులతో జోడి కట్టింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో నటించి స్మైలింగ్ క్వీన్ గా కూడా పేరు దక్కించుకున్న కేఆర్ విజయ.. తండ్రి ప్రోత్సాహంతోనే ఇండస్ట్రీలోకి వచ్చినట్లు సమాచారం.

కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే 1966లో పెళ్లి చేసుకున్న ఈమె భర్త అనుమతితో మళ్ళీ నటనను మొదలుపెట్టింది. 60 ఏళ్లకు పైగా సినిమాలలో నటిస్తున్న కే.ఆర్.విజయ.. 70 వ దశకం నుండి ప్రముఖ రాయల్ ఎన్ ఫీల్డ్ బైకును నడిపే వారట. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఫోటోలు బయటకు రావడంతో ఈ ఫోటోలు చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు