VN2 : నితిన్ నెక్స్ట్ మూవీ టైటిల్ లీక్… టైటిల్ కు తగ్గట్టే బాక్స్ ఆఫీస్ ను కొల్లగొడతాడా?

VN2 : ఎనర్జిటిక్ హీరో నితిన్, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ VN2. వీళ్ళిద్దరికి కాంబినేషన్లో గతంలో “భీష్మ” అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రెండవసారి నితిన్, డైరెక్టర్ వెంకీ కాంబినేషన్లో రాబోతున్న కొత్త మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమాను VN2 అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే చిత్ర బృందం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే ఫిలిం వర్గాల నుంచి VN2 టైటిల్ లీక్ అయ్యింది.

నితిన్ హీరోగా, వెంకి కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా VN2. ఈ మూవీనీ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ పాత్రను పోషిస్తుంది. గత ఏడాది విడుదలైన “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” సినిమాలో నితిన్, శ్రీలీల జోడిగా కనిపించిన విషయం తెలిసిందే.

నిజానికి ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికను అనుకున్నారు. కానీ షూటింగ్ స్టార్ట్ అయ్యే సమయానికి ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో శ్రీలీలను తీసుకున్నారు. ప్రస్తుతం కేరళలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. అక్కడ హీరో హీరోయిన్లపై డైరెక్టర్ కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ టీం తిరిగి హైదరాబాదుకు రాబోతోంది.

- Advertisement -

ఇక VN2 సినిమాలో నితిన్ జనాలను నమ్మించి బురిడీ కొట్టించే మోసగాడిలా కనిపించబోతున్నాడని సమాచారం. “గిఫ్ట్స్ ఇచ్చే సీజన్ ముగిసింది. త్వరలోనే దోచుకునే సీజన్ మొదలు కాబోతోంది. జనవరి 26న ఉదయం 11 : 07 గంటలకు మోసగాడి ముఖాన్ని మీకు చూపిస్తాము” అని మైత్రి మూవీ మేకర్స్ వారు చేసిన పోస్ట్ తో హీరో రోల్ ఎలా ఉండబోతుంది అన్న విషయం రివీల్ అయింది. ఇక తాజాగా ఫిలిం సర్కిల్స్ నుంచి మూవీ టైటిల్ కూడా లీక్ అయింది. ఈ సినిమాలో నితిన్ మోసగాడి పాత్రలో కనిపించబోతున్నాడు.

కాబట్టి దానికి తగ్గట్టుగా “రాబిన్ హుడ్” అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా మేకర్స్ టైటిల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే చాలా కాలం నుంచి సరైన హిట్ లేని నితిన్ మరి పేరుకు తగ్గట్టుగా ఈ సినిమాతోనైనా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొడతాడా అనేది చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు