Allu Arjun Pushpa 2: పుష్పలో బాహుబలి రేంజ్‌ ట్విస్ట్… అల్లు అర్జున్‌ను చంపేది అతనే..

Allu Arjun Pushpa 2

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్,రానా హీరోలుగా తెరకెక్కుతూ ప్రేక్షకులను అలరించిన చిత్రం బాహుబలి.ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే చరిత్ర సృష్టించింది..ఈ సినిమా క్లైమాక్స్ లో ట్విస్ట్ ఇస్తూ.. సీక్వెల్ తెరకెక్కించి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.ఇక బహుబలి సినిమా విషయానికి వస్తే..బాహుబలి సైన్యాధ్యక్షుడు కట్టప్పను మేనమామగా భావించి.. అతనిపై పూర్తి నమ్మకం పెట్టుకుంటాడు. కానీ కొన్ని కారణాలవల్ల ఆయనే బాహుబలికి వెన్నుపోటు పొడిచి చంపేస్తాడు..

ఇప్పుడు ఇదే క్లైమాక్స్ తో పుష్ప 2 రాబోతోందని సమాచారం.. ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఇదివరకే పుష్ప సినిమా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఇదే కాంబినేషన్లో పుష్ప సీక్వెల్ గా పుష్ప 2 ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.. సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని విషయాలు లీక్ అయ్యాయి. ఈ సినిమాలో పుష్ప పక్కన ఉన్న క్యారెక్టర్ కేశవనే పుష్ప ను చంపబోతున్నట్టు ఆ లీక్ ల సారాంశం. ఈ సినిమాలో చివర్లో పుష్ప చనిపోతాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

పుష్ప ను ఎవరు చంపలేరు కాబట్టి.. తనని చంపే వాడెవడు ? అనే పాయింట్ ను బేస్ చేసుకుని సినిమా మొత్తం నడుస్తుందట.. చివరలో కొన్ని ప్రలోభాలకు లోబడిన కేశవ పుష్పని చంపేస్తాడు అంటూ కొన్ని లీకులైతే తాజాగా అందుతున్నాయి. వాస్తవానికి ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. ఇప్పుడు ఇలాంటి లీకేజ్ ల వల్ల ఈ సినిమా స్థాయి మరింత పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే పార్ట్ 2 పై నార్త్ జనాలు పడి చచ్చిపోతున్నారని చెప్పాలి. అలాంటి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ సినిమా రిలీజ్ అవ్వడమే ఆలస్యం అన్నట్టుగా అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు..

- Advertisement -

మరి ఇలాంటి క్రమంలో పుష్ప 2 సినిమా అటు సుకుమార్ కి ఇటు అల్లు అర్జున్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి. మొత్తానికైతే పుష్ప సినిమా ఎండింగ్లో పుష్పరాజ్ చనిపోతాడు అనే వార్త లీక్ అవడం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇది చూసిన కొంతమంది బాహుబలి రేంజ్ లో క్లైమాక్స్ ని సృష్టించబోతున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిని సుకుమార్ ఏ విధంగా తెరకెక్కించబోతున్నారో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు