Raghuvaran: రఘువరన్ పతనం వెనుక ఆ స్టార్ హీరో భార్య.. ఎవరామే..?

Raghuvaran

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ గా, నటుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటుడు రఘువరన్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించారు. ఈయన విలనిజంతోనే ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా అందుకున్నాయి. రఘువరన్.. అలనాటి హీరోయిన్లలో ఒకరైన రోహిణిని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు.. కానీ ఈమె కంటే ముందుగా నాగార్జున భార్య అమల ని కూడా ప్రేమించారనే వార్తలు గతంలో ఎక్కువగా వినిపించాయి.. అయితే రఘువరన్ ప్రేమించిన విషయం మాత్రం అమలకు తెలియదట.

శివ సినిమా షూటింగ్ సమయంలో రఘువరన్ అమలను వన్ సైడ్ లవ్ చేశారట.. కానీ అప్పటికే అమల నాగార్జున క్లోజ్ గా ఉండడంతో ఆ విషయాన్ని సహించలేకపోయిన రఘువరన్.. నెమ్మదిగా మద్యానికి దగ్గరయ్యారు.. నాగార్జున ,అమల వివాహమయ్యాక మద్యానికి మరింత బానిస అయ్యారట రఘువరన్.. అలాంటి సమయంలో రోహిణి ఆయన జీవితంలోకి అడుగుపెట్టింది. రోహిణిని ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ ఆమె పక్కన ఉండగానే రఘువరన్ కు వేరే ఆలోచనలు ఎక్కువగా ఉండేవి.. ఈ విషయం తెలిసి ఆమె చాలా బాధపడేదట.

అయినప్పటికీ వీరికి ఒక బిడ్డ పుడితే కచ్చితంగా తన భర్త మారుతారనే నమ్మకం ఆమెలో వుండేది.. కానీ కొడుకు పుట్టిన తర్వాత కూడా ఆయనలో ఏ మార్పు రాలేదు.. ఒకవైపు సినిమా అవకాశాలు లేక మరొకవైపు తన భర్త ప్రేమను నోచుకోలేక రోహిణి చాలా ఇబ్బందులను ఎదుర్కొందట. ఇక రఘువరన్ రోహిణి మధ్య రోజు రోజుకి గొడవలు పెద్దదవుతూ ఉండడంతో .. కొడుకు పుట్టిన కొన్ని సంవత్సరాలకి విడాకులు తీసుకున్నారు.

- Advertisement -

విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరి అయిపోయిన రఘువరన్ మరింత కృంగిపోయి ఎక్కువగా మద్యానికి బానిస అయ్యి హార్ట్ ఎటాక్ తో చనిపోయారని అప్పట్లో వార్తలు వినిపించాయి.. ఈయన మరణానికి ముఖ్య కారణం కూడా మద్యపానమే అన్నట్లుగా తెలుస్తోంది. అమలను పిచ్చిగా ప్రేమించిన రఘువరన్ ఇలా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా కూడా అమలను మర్చిపోలేక.. అటు సినిమా కెరియర్ ను ఇటు తన జీవితాన్ని కూడా నాశనం చేసుకున్నారనే వార్తలు ఇప్పటికీ కూడా ఇండస్ట్రీలో అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఈ విషయం పైన అటు రోహిణి ఇప్పటివరకు ఏ విధంగా కూడా స్పందించలేదు.రోహిణి మాత్రం అడపా దడపా సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ బాగానే నిలదొక్కుకొనే ప్రయత్నాలు చేస్తోంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు