Ester: నోయెల్ తో విడాకులపై క్లారిటీ ఇచ్చిన ఎస్తేర్..!

Ester

ఏ ఇండస్ట్రీలో నైనా సరే సెలబ్రిటీల మధ్య ప్రేమ పుట్టడం సర్వసాధారణమని చెప్పవచ్చు. అయితే చాలామంది ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్తే.. మరి కొంతమంది మధ్యలో బ్రేకప్ చెబుతూ ఉంటారు.. మరి కొంతమంది వివాహమైన తర్వాత విడిపోవడం  మనం చూస్తూ ఉన్నాము. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో జంటలు విడిపోయాయి. అలా ప్రేమించి విడాకులు తీసుకున్న వారిలో హీరో నోయెల్ , హీరోయిన్ ఎస్తేర్ నూరాన్హ కూడా ఒకరు.

ఎస్తేర్ హీరోయిన్ గా టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించి బాగానే ఆకట్టుకుంది. తన ఆనందం,  అభినయంతో ఎంతోమంది కుర్రకారు మతులు పోగొట్టింది. మరోవైపు నోయెల్ కూడా సింగర్ గా  ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా పలు సినిమాలలో హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. అయితే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి 2019లో చాలా ఘనంగా పెళ్లి చేసుకున్నారు.. వీరి పెళ్లికి ఎంతో మంది సినీ ప్రముఖులు కూడా వచ్చి ఆశీర్వదించారు. అయితే పెళ్లి అయిన మూడు నెలలకే వీరిద్దరి మధ్య గొడవలు రావడంతో విడిపోయారు.

ఈ విషయం విన్న వీరి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పటివరకు వీరి విడాకులకు కారణమేంటనే విషయం మాత్రం అసలు తెలియలేదు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తేర్ విడాకుల గురించి పలు విషయాలను తెలిపింది. తన మాజీ భర్త నోయెల్  క్యారెక్టర్ గురించి విస్తుపోయే నిజాలను వెల్లడించింది.. వివాహమైన 16 రోజులకే  నోయెల్ తన నిజ స్వరూపాన్ని బయటకి తీశారు అంటూ  తెలియజేసింది.

- Advertisement -

నోయెల్ ఎక్కడికి వెళ్ళినా నా గురించి చాలా బ్యాడ్ గా చెప్పే వారు.. అందుకే నేను అతని నుంచి విడిపోయాను. అంతేకాకుండా నా మీద ఎక్కువగా పెత్తనం చెలాయించేవారు.. అది నేను సహించలేక పోయాను.. అందుకే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందంటూ తెలిపింది ఎస్తేర్.విడాకులు తీసుకున్న తర్వాత కూడా తన మీద ఒక బ్యాడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారని తెలిపింది.. ఇక ఈమె నటించిన చిత్రాలలో భీమవరం బుల్లోడు, 1000 అబద్దాలు తదితర సినిమాలు ఈమెకు మంచి పేరును తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఎస్తేర్ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు