HBD Abhishek Bachchan : 15 ఫ్లాఫ్ లతో బిగ్ బి పరువు తీసిన అభిషేక్… నేషనల్ అవార్డు ఎలా అందుకున్నాడంటే?

HBD Abhishek Bachchan

ఈరోజు బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. 1976 ఫిబ్రవరి 5న జన్మించిన అభిషేక్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న సూపర్ స్టార్స్ లో ఒకరు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బి అమితాబ్ వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అభి కెరీర్లో కష్టాలు పడాల్సి వచ్చింది. మిగతా స్టార్ కిడ్స్ లాగా కాకుండా అభిమానుల ఆదరణకు నోచుకోవడానికి ఆయనకు చాలా సమయం పట్టింది. అభిషేక్ హిందీ చిత్రసీమలో అడుగు పెట్టి 24 ఏళ్లు పూర్తి అవుతోంది. 2000 సంవత్సరంలో ‘రెఫ్యూజీ’ సినిమాతో కెరీర్ ప్రారంభించాడు. ఆ తరువాత, అతను ‘ధూమ్’, ‘యువ’, ‘సర్కార్’, ‘బంటీ ఔర్ బబ్లీ’, ‘గురు’ వంటి చిత్రాలలో నటించి, తన అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ తో మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. కానీ ఈ సక్సెస్ వెనుక ఆయన పడ్డ కష్టం గురించి మాత్రం చెప్పుకోవాల్సిందే.

కెరీర్ తొలినాళ్లలో…
సూపర్ స్టార్ కొడుకుగా సినిమాల్లోకి అడుగుపెట్టిన అభిషేక్ పై ప్రేక్షకులలో అంచనాలు ఓ రేంజ్ లో ఉండేవి. తొలి చిత్రం “రెఫ్యూజీ” పెద్దగా ఆడకపోయినా, తన నటనతో ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు ఈ హీరో. కానీ ఆ తరువాత జూనియర్ బచ్చన్ కు యాక్టింగ్ రాదంటూ విమర్శలు వెల్లువెత్తడంతో పాటు వరుసగా సినిమాలు డిజాస్టర్లుగా మిగలడంతో అభికి తీవ్ర నిరాశ ఎదురైంది. అలాగే అమితాబ్ పరువు తీస్తున్నాడంటూ ఆయన అభిమానులు అభిపై విమర్శలతో విరుచుకుపడ్డారు.

15 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్…
కరీనా కపూర్‌తో “రెఫ్యూజీ” చేసిన తర్వాత అభిషేక్ బచ్చన్‌కు వరుస ఆఫర్లు వచ్చాయి. అయితే అవన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడం గమనార్హం. ఒకటి రెండు కాదు 15 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నాడు అభి. ఇందులో తేరా జాదూ చల్ గయా (2000), ధై అక్షర్ ప్రేమ్ కే (2000), బస్ ఇత్నా సా ఖ్వాబ్ హై (2001), యా మైనే భీ ప్యార్ కియా. (2002), శరరత్ (2002), మెయిన్ ప్రేమ్ కీ దీవానీ (2003), ‘కార్గిల్’ వంటి సినిమాలు ఉన్నాయి.

- Advertisement -

నాలుగేళ్ల తరువాత తొలి హిట్
మొదటి నాలుగేళ్లు అభిషేక్ బచ్చన్‌కు దారుణంగా నిరాశను మిగిల్చాయి. వరుస ఫ్లాప్ చిత్రాల తరువాత 2004లో వచ్చిన “ధూమ్”తో అభి తన కెరీర్‌లో మొదటి సూపర్‌హిట్ మూవీని అందుకున్నాడు.ఈ మూవీలో ఏసీపీ జై దీక్షిత్‌గా అభిషేక్‌తో పాటు జాన్ అబ్రహం, ఉదయ్ చోప్రా, బిపాసా బసు, ఈషా డియోల్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఈ హిట్ తరువాత అభి వెనక్కి తిరిగి చూసే అవసరం రాలేదు. “బంటీ ఔర్ బబ్లీ” మూవీ ప్లాప్ అయినప్పటికీ ఆ తరువాత సర్కార్, దస్, బ్లఫ్ మాస్టర్, కభీ అల్విదా నా కెహనా, ధూమ్ 2, గురు, సర్కార్ రాజ్, దోస్తానా, పా, బోల్ బచ్చన్, ధూమ్ 3, హ్యాపీ న్యూ ఇయర్ వంటి హిట్ చిత్రాలతో ఆయన దశ తిరిగింది.

పా చిత్రానికి అభిషేక్ జాతీయ ఫిలిం అవార్డును అందుకుని, అమితాబ్ వారసుడిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు. ఆ తరువాత అభి ఓటిటిలో కూడా లూడో, బ్రీత్ లాంటి వెబ్ సిరీస్ లలో నటించి ప్రశంసలు అందుకున్నారు. సినిమాకు పనికిరాదంటూ ఎన్ని విమర్శలు వచ్చినా పట్టువదలని విక్రమార్కుడిలా అనుకున్నది సాధించిన అభిషేక్ బచ్చన్ కు FilmiFy తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు