Sada: హీరోయిన్ సదా పై డైరెక్టర్ తేజ ఆగ్రహం.. కారణం..?

Sada

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మొదట జయం సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైంది హీరోయిన్ సదా. ప్రముఖ హీరోలతో కలిసి పనిచేసి.. ఆ తర్వాత కాలంలో అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమయింది. అయితే బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చి.. పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ తన కెరియర్ ను కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడిప్పుడే మళ్ళీ వెండితెరపై కూడా దర్శనమిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అయితే హీరోయిన్ గా కాకుండా సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ.. మరోవైపు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా మెయింటైన్ చేస్తోంది. దీంతో తన జీవితంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ సంఘటనలను కూడా అభిమానులతో పంచుకుంటోంది.

గతంలో డైరెక్టర్ తేజ దర్శకత్వంలో పనిచేసిన ఒక సినిమాలో తనని ఎందుకు తిట్టారు అనే విషయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేసింది సదా. అసలు విషయంలోకి వెళ్తే.. జయం సినిమా షూటింగ్ సమయంలో ఆ సినిమా షూటింగ్ ఎక్కువగా ఫారెస్ట్ లోనే జరిగిందని.. క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం కూడా అడవులలోనే షూట్ చేశారని తెలిపింది. డైరెక్టర్ తేజ నటీనటుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. అనుకోకుండా సదా ఒక పిచ్చి పని చేయడం తో డైరెక్టర్ తేజ చేత చివాట్లు పడ్డట్టు తెలుస్తోంది.

భోజనం చేసిన తర్వాత షూటింగ్ సమయంలో కాసేపు గ్యాప్ దొరకడంతో సదా మేకప్ మ్యాన్ అయిన భాస్కర్ ను పిలిపించి రిహార్సల్ చేస్తూ ఉండగా.. తన మేకప్ మ్యాన్ ఐబ్రోస్ విషయంలో కొంచెం చేంజ్ చేద్దామని అడిగారట. రెండు కర్లీ వెంట్రుకలు ఉండడంతో కట్ చేద్దామని చెప్పడంతో సదా కూడా ఓకే చెప్పిందట. అలా కొంచెం కట్ చేయకుండా చాలా ఎక్కువగా కట్ చేయడంతో రెండు ఐబ్రోస్ మధ్య చాలా తేడా కొట్టేసింది.

- Advertisement -

అలా నెమ్మదిగా అడ్జస్ట్ చేయడంతో.. చివరికి సదా ఫేస్ లో చాలా చేంజ్ కనిపించిందట. ఇక సదాని ఒక్కసారిగా చూసిన డైరెక్టర్ తేజ ఎందుకు నువ్వు చైనీస్ బొమ్మలా తయారయ్యావు.. అసలు నువ్వు ఏం చేస్తున్నావు.. అంటూ ఆమె పైన ఫైర్ అయ్యారట.. అలా ఆయన కోప్పడడంతో అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె తన ఐబ్రోస్ ని తానే సొంతంగా రిమూవ్ చేసుకుంటున్నానని తెలియజేసింది సదా. ప్రస్తుతం సదా చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు