Kareena Kapoor : రాహుల్ గాంధీని పెళ్లాడాలనుకున్న కరీనా… కానీ ఎలా మిస్ అయ్యిందంటే?

Kareena Kapoor

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి అమ్మాయిల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన రాజకీయ నాయకుడు అయినప్పటికీ స్టార్ హీరో లాంటి క్రేజ్ ఉంది. ఆయనతో కలిసి సెల్ఫీలు దిగడానికి అమ్మాయిలు ఎగబడతారు. అలాంటి సెలబ్రిటీ ఫాలోయింగ్ ఉన్న రాహుల్ గాంధీని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పెళ్లి చేసుకోవాలనుకున్నారట. మరి ఆ ఛాన్స్ ఎలా మిస్సయింది? అంటే…

ప్రముఖ జర్నలిస్ట్, రచయిత రషీద్ కిద్వాయ్ తాను రాసిన “నేతా అభినేతా : బాలీవుడ్ స్టార్ పవర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్” అనే పుస్తకంలో అటు బాలీవుడ్ స్టార్స్, ఇటు రాహుల్ గాంధీ కుటుంబం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. అందులో భాగంగానే కరీనా కపూర్, రాహుల్ గాంధీకి పెళ్లి కావాల్సి ఉందని, కానీ కుదరలేదు అనే ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించారు. ఆ పుస్తకం ప్రకారం 2002లో రాజ్ కపూర్ మనవరాలు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఇప్పటి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలని భావించారు. అదే సమయంలో రాహుల్ గాంధీ కూడా కరీనా హీరోయిన్ గా నటించిన సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి ఆసక్తిని కనపరిచారు. అప్పట్లో “రొండేవో విత్ సిమీ గరేవాల్” అనే టీవీ షోలో పాల్గొన్న కరీనాకు ఎవరితో డేటింగ్ చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్న ఎదురైనప్పుడు, ఆమె వెంటనే రాహుల్ గాంధీ పేరు చెప్పింది.

రాహుల్ గాంధీతో డేట్ చేయడానికి తను సిద్ధమని, అతన్ని అర్థం చేసుకోవడంలో తనకు ఎటువంటి ఇబ్బంది లేదని కరీనా కపూర్ ఆ షోలో చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ వీళ్ళిద్దరి పెళ్లి మాత్రం జరగలేదు. 2009లో కరీనా మనసు మార్చుకుందని తెలుస్తోంది. ఇక 2012లో ఈ బ్యూటీ బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఇక అప్పట్లో కపూర్ కుటుంబానికి, గాంధీ కుటుంబానికి మధ్య మంచి స్నేహం ఉండేదట. రాజీవ్ గాంధీని, రాజ్ కపూర్ పెద్ద కుమార్తె రీతు కపూర్ కు ఇచ్చి వివాహం చేయాలని ఇందిరా గాంధీ కోరుకుందట. కానీ రాజీవ్ గాంధీ మాత్రం సోనియా గాంధీని ప్రేమించారు. దీంతో అప్పట్లో అది కూడా సాధ్యం కాలేదు. మొత్తానికి ఈ రెండు కుటుంబాలు తమ వారసులకు పెళ్లి చేసి, స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలి అనుకున్నప్పటికీ అసాధ్యమైంది అన్నమాట. మరోవైపు రాహుల్ గాంధీ 50 ఏళ్లు దాటినా ఇప్పటికీ సింగిల్ గానే గడిపేస్తున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు