Jayaprada: జయప్రద అరెస్ట్ కి సర్వం సిద్ధం.. ఏమైందంటే..?

Jayaprada

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీఆర్ , ఏఎన్ఆర్, చిరంజీవి వంటి స్టార్ సీనియర్ హీరోలతో కలిసి నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న జయప్రద గురించి ఈతరం ప్రేక్షకులకు కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఎందుకంటే ఈమె ఇటీవల సినిమాలలో నటించకపోయినా రాజకీయాలలో యాక్టివ్ గా ఉంటూ పలు కారణాలవల్ల వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం జయప్రదకు ఈఎస్ఐ కి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా ఇప్పుడు ఆమెకు మరో పెద్ద షాక్ తగిలిందని చెప్పాలి..

2019 లోకసభ ఎన్నికల సమయంలో నిబంధనలను ఆమె ఉల్లంఘించారని జయప్రద పై రెండు కేసులు నమోదు అవ్వగా వీటిపై ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు..అందుకే వెంటనే ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాలి అంటూ రాంపూర్ ఎస్పీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలు విషయంలోకి వెళ్తే 2019 ఎన్నికల్లో బిజెపి తరఫున ఎంపీ అభ్యర్థిగా రాంపూర్ నుంచి జయప్రద పోటీ చేశారు. ఈ సమయంలోనే ఎన్నికల నియమావళిని ఆమె ఉల్లంగించారంటూ ఆమెపై రెండు కేసులు కూడా నమోదు చేశారు . కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లో ఈ కేసులు నమోదు అవ్వగా వీటికి సంబంధించిన విచారణ ప్రజా ప్రతినిధుల కోర్టులో కొనసాగుతోంది . ఈ క్రమంలోనే కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఎన్నో సార్లు ఆమెకు నోటీసులు జారీ చేసినీ దీనిపై ఆమె స్పందించలేదు దీంతో ఆమెకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.. ఇప్పటివరకు ఏడుసార్లు వారెంట్ జారీ చేసిన పోలీసులు అరెస్టు చేయలేదని ప్రభుత్వా న్యాయవాది తెలిపారు. దీంతో వెంటనే ఆమెను రెస్ట్ చేయాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 27వ తేదీకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

మొదట సినిమాలలో చేస్తున్నప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన ఈమె.. రాజ్యసభ ఎంపీగా కొద్దిరోజులు పనిచేశారు.. ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ మరణించడంతో.. విభేదాలు తలెత్తాయి. దాంతో సమాజ్ వాది పార్టీలో చేరి రాంపూర్ లోకసభ ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 2014 వరకు రాంపూర్ ఎంపీగా పనిచేసిన ఈమె 2019లో బిజెపిలో చేరి రాంపూర్ అభ్యర్థిగా పోటీ చేశారు. అదే సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన నేపథ్యంలో తాజాగా పోలీసులు అరెస్టు చేయబోతున్నట్లు సమాచారం. మరి దీనిపై జయప్రద ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి .అయితే ఈ విషయం తెలిసి అభిమానులు మాత్రం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు