Rohini: నంది అవార్డు వచ్చినా.. ఇవ్వకుండా అడ్డుకున్నారు- రోహిణి

Rohini

ప్రముఖ బుల్లితెర నటి రోహిణి ఒకానొక సమయంలో వరుస సీరియల్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ మధ్య సీరియల్స్ లో చేయకపోయినా పలు కార్యక్రమాలకు హోస్ట్ గా చేస్తూ మరికొన్ని కామెడీ షోలలో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రోహిణి తనకు జరిగిన అన్యాయం గురించి కూడా పోస్ట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గత కొన్నాళ్ల నుంచి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు నంది అవార్డులు ఇవ్వడం ఆపేసిన విషయం తెలిసిందే .సినిమా, టీవీ, నాటకాలు ఇలా ఏ కేటగిరీలో కూడా నంది అవార్డులను ఇవ్వడం లేదు.. దీనిపై టాలీవుడ్ లో చర్చలు కూడా జరిగాయి.. పైగా ప్రభుత్వాలతో సినీ ప్రముఖులు మాట్లాడారు కూడా.. అయినా సరే నంది అవార్డులను ప్రభుత్వాలు ఇవ్వడానికి ముందడుగు వేయలేదు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం తాజాగా నంది అవార్డులకు పేరు మారుస్తూ.. గద్దర్ అవార్డుగా ప్రకటించింది.. కానీ ఈ అవార్డులను ఎప్పటినుంచి అందజేస్తారు అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు..

ఇదిలా ఉండగా తాజాగా రోహిణి కూడా ఈ అవార్డుల విషయంలో తనకు అన్యాయం జరిగిందని సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.. రోహిణి కెరియర్ మొదట్లో చేసిన “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” సీరియల్ లో తన పాత్రకు బెస్ట్ లేడీ కమెడియన్ గా నంది అవార్డు వచ్చిందని.. ఈ అవార్డును ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం తనకు పంపిన లెటర్ ని తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 2018లో 2014 సంవత్సరం అవార్డులు ప్రకటించగా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్లో రోహిణి పాత్రకు బెస్ట్ టీవీ కమెడియన్ నంది అవార్డు ప్రకటించినట్టు.. అందుకు నంది అవార్డుతో పాటు 10వేల రూపాయలు ఇస్తామని లెటర్ పంపించారు.. అయితే ఆ లెటర్ ని ఇప్పుడు రోహిణి సోషల్ మీడియాలో షేర్ చేసి నా ఫస్ట్ సీరియల్ కి నంది అవార్డు వచ్చింది..

 

View this post on Instagram

 

A post shared by Rohini (@actressrohini)

- Advertisement -

కానీ ఇప్పటివరకు నాకు అది అందలేదు.. నా కెరియర్ లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్ ఒక మంచి జ్ఞాపకం.. గతంలో నేను సాధించిన దాన్ని జస్ట్ ఇలా షేర్ చేయాలనుకున్నాను అంటూ పోస్ట్ చేసింది రోహిణి.. దీంతో రోహిణి పోస్ట్ వైరల్ గా మారింది.. కొంతమంది దీన్ని రాజకీయ కోణంలో చూస్తూ అప్పుడెప్పుడో ప్రకటించి ఇవ్వకపోతే.. ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేశావని ప్రశ్నిస్తుంటే.. మరికొంతమంది మాత్రం నంది అవార్డు దక్కించుకున్న రోహిణిని అభినందిస్తున్నారు

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు