Bramayugam: చివరి నిమిషంలో చిక్కుల్లో పడ్డ మమ్ముట్టి మూవీ… రిలీజ్ అవుతుందా?

Bramayugam

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తాజా చిత్రం కొన్ని గంటల ముందు వివాదంలో చిక్కుకుంది. “భ్రమయుగం” అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ హార్రర్ థ్రిల్లర్ లో హీరో పోషించిన పాత్ర పేరును మార్చాలని లేదంటే, సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలంటూ తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు అయింది.

రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో చేతబడుల నేపథ్యంలో 18వ దశాబ్దం నాటి కథతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన “భ్రమయుగం” చిత్రం ఫిబ్రవరి 15న థియేటర్లోకి రాబోతోంది. మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాను నైట్ షిఫ్ట్ స్టూడియోస్ బ్యానర్ పై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మిస్తున్నారు. మలయాళంలో ముందుగా రిలీజ్ చేసి, ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఓవైపు ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంటే, మరోవైపు కేరళ హైకోర్టులో కేసు దాఖలు కావడం గమనార్హం. ఈ సినిమాలో హీరో మమ్ముట్టి పోషించిన కుంజుమోన్ పొట్టి అనే పాత్ర పేరును మార్చాలి అంటూ కేరళలోని సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పుంజమోన్ పిటిషన్ వేశారు. జస్టిస్ దేవన్ రామచంద్రన్ ఈ కేసును విచారించగా, “భ్రమయుగం” సినిమా తమ వంశ చరిత్రకు సంబంధించిన “ఇతేహైమల” అనే పుస్తకాన్ని బేస్ చేసుకుని తీసినట్టు ఉందని పిటిషనర్లు జడ్జికి తెలిపారు.

మమ్ముట్టి పోషించిన పాత్ర పేరు మార్చకపోతే తమ కుటుంబ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని, ఈ సినిమాలో కుంజుమోన్ పొట్టి అనే పాత్రను నెగిటివ్ గా, డార్క్ మ్యాజిక్ ను నేర్చుకుంటున్నట్టు చూపించారని, వెంటనే సినిమా సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాజంలో తమ కుటుంబం పరువు తీయడానికే ఉద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రయత్నం జరిగిందని పుంజమోన్ కుటుంబం పేర్కొంది. కొన్ని రోజుల నుంచి దీనిపై కోర్టులో విచారణ జరుగుతుండగా, చివరగా ఫిబ్రవరి 14కు వాయిదా పడిన ఈ కేసు తాజాగా మరోసారి విచారణకు వచ్చింది. కేరళ హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్మాతలు పేరు మార్పుకు అంగీకరించినట్టు సమాచారం.

- Advertisement -

ఇప్పటిదాకా సినిమాలో కుంజమోన్ పొట్టి అని ఉన్న పేరును కొడుమోన్ పొట్టిగా మారుస్తామని, ఈ మేరకు ఇప్పటికే సెన్సార్ బోర్డుకు అప్లై చేసుకున్నామని వెల్లడించారు. జస్టిస్ దేవన్ రామచంద్రన్ ఈ విషయమై రేపు సమాధానం ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించారు. అయితే రిలీజ్ కు కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా, ఈ వివాదం నుంచి సినిమా ఇంకా బయటపడకపోవడంతో మమ్ముట్టి అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే “భ్రమయుగం” సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తుంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు