Yellamma: అటకెక్కిన నాని, “బలగం” వేణు మూవీ

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. గత ఏడాది “హాయ్ నాన్న” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో నెక్స్ట్ మూవీ గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాని నెక్స్ట్ “బలగం” ఫేమ్ డైరెక్టర్ కం కమెడియన్ వేణు దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆ ప్రాజెక్టు అటకెక్కినట్టు తెలుస్తోంది.

అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించిన నాని నేచురల్ స్టార్ గా తెలుగు ఆడియన్స్ మనసులో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రతి సినిమాకు వైవిధ్యం చూపిస్తూ, కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ను అందుకుంటున్నాడు. 2023లో ఒక్క మిడ్ రేంజ్ హీరోకు కూడా కలిసి రాలేదు. కానీ నాని మాత్రం రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని తన కంటెంట్ సెలక్షన్ ఎంత పక్కాగా ఉంటుందో మరోసారి నిరూపించారు. దసరా సినిమాతో 100 కోట్ల క్లబ్ చేరిన ఈ యంగ్ హీరో “హాయ్ నాన్న” సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ టైంలోనే తను నెక్స్ట్ బలగం డైరెక్టర్ వేణుతో సినిమా చేయాలని కోరుకుంటున్నట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు నాని. దీంతో ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసినట్టు అయింది. ఇక ఆ తర్వాత వేణు చెప్పిన కథతో దిల్ రాజు ఇంప్రెస్ అయ్యారని, నాని హీరోగా చేయబోతున్న ఈ సినిమాకు “ఎల్లమ్మ” అని పేరు పెట్టారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో “సరిపోదా శనివారం” సినిమా చేస్తుండగా, డాన్ ఫేమ్ శిబి చక్రవర్తితో మరో మూవీ చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాల తర్వాత నాని “ఎల్లమ్మ” ప్రాజెక్టు పట్టాలెక్కుతుందని భావించిన అందరికీ షాక్ ఇచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది.

నాని, వేణు ప్రాజెక్ట్ “ఎల్లమ్మ” క్యాన్సిల్ అయినట్టు తాజా సమాచారం. ఈ ప్రాజెక్టును పక్కన పెట్టి త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి నాని ఆసక్తిని కనబరుస్తున్నారట. దాదాపు 90 శాతం వరకు నాని, త్రివిక్రమ్ కాంబోలో ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి రూట్ క్లియర్ అయిందని తెలుస్తోంది. అయితే వేణు చెప్పిన కథ నచ్చినప్పటికీ, దాన్ని క్యాన్సిల్ చేసి మరీ త్రివిక్రమ్ ప్రాజెక్టు వైపు మొగ్గు చూపుతున్నారట నాని. వాస్తవానికి “హాయ్ నాన్న” సినిమా ప్రమోషన్ల సమయం నుంచే త్రివిక్రమ్ దర్శకత్వంలో నాని హీరోగా ఓ మూవీ రాబోతుందని ప్రచారం జరుగుతుంది. ఇక రీసెంట్ గా “గుంటూరు కారం” మూవీ ఆశించిన విధంగా ఆడక పోవడంతో స్టార్ హీరోలు ఎవ్వరూ త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ఆసక్తి చూపించట్లేదని, అందుకే ఆయన నానితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని ప్రచారం జరుగుతుంది. మొత్తానికి త్రివిక్రమ్ వల్ల నానితో సినిమా చేయాలని ఆశపడిన వేణుకు గట్టి షాక్ తగిలిందని అంటున్నారు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు