Dubbing artist: ఈ హీరోయిన్స్ కి తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారిన స్టార్ డైరెక్టర్ భార్య..!

భాషతో సంబంధం లేకుండా పాపులారిటీ సంపాదించుకుంటున్న వారిలో సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు ప్రథమ స్థానంలో ఉంటారు అనడంలో సందేహం లేదు.. తమకు భాష రాకపోయినా తమ నటనతో , అందంతో.. ఇతరుల సహాయంతో భారీ పాపులారిటీ దక్కించుకుంటున్నారు… ఇక ఒకరకంగా చెప్పాలి అంటే ప్రేక్షకులను మెప్పించాలి అంటే ఆయా ప్రాంతీయ భాషలు తెలిసి ఉండాలి.. అయితే అలా తెలియని సందర్భాలలో ఇతరుల చేత తమ పాత్రకు డబ్బింగ్ చెప్పించుకుని. తమ నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మరి అలాంటి వారిలో ప్రధమంగా నిలిచేది హీరోయిన్లే అని చెప్పాలి.. ఇప్పటికే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ప్రేక్షకులను అలరించడమే కాదు విపరీతంగా ఆకట్టుకుంటున్నారు కూడా అయితే ఈ హీరోయిన్లకు తెలుగు రాకపోయినా డబ్బింగ్ ఆర్టిస్టుల చేత డైలాగులు చెప్పించి అభిమానులకు మరింత చేరువవుతున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. కాజల్ అగర్వాల్, నయనతార, తమన్నా , అనుష్క శెట్టి వంటి హీరోయిన్లకు మన తెలుగు ఇండస్ట్రీలో భారీ క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఆన్ స్క్రీన్ మీద వీరి స్క్రీన్ ప్రజెన్స్ కి తెలుగు ఆడియన్స్ బాగా ఫిదా అవుతారు కానీ వీరి కెరియర్ లో మెజారిటీ షేర్ ఉన్న వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గురించి చాలామందికి తెలియదనే చెప్పాలి.. ముఖ్యంగా కాజల్ , అనుష్కకి తెలుగు రాదు కాబట్టి వారికి డబ్ చేయడానికి డబ్బింగ్ ఆర్టిస్ట్ లు ఉండేవారు. అయితే వీరి కెరియర్ లో డిఫరెంట్ డబ్బింగ్ ఆర్టిస్టు డబ్బింగ్ చెప్పారు.. ఈ క్రమంలోనే ఒక డబ్బింగ్ ఆర్టిస్టు తెరపైకి వచ్చారు.. ఆమె సౌమ్య శర్మ.. ఇంతకు ఈమె ఎవరు ? ఏ ఏ సినిమాలకు డబ్బింగ్ చెప్పింది..?

ఏ హీరోయిన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పింది..? అనే విషయానికి వస్తే.. సూపర్ మూవీలోకి డబ్బింగ్ చెప్పి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఆర్జే సౌమ్య శర్మ ఆ తర్వాత చత్రపతిలో శ్రియ, లక్ష్మీ లో నయనతార కి డబ్బింగ్ చెప్పారు.. అలాగే విక్రమార్కుడు మూవీ లో అనుష్క పాత్రకు సౌమ్యా శర్మ తొలిసారి వినిపించారు.. ఇక్కడ విశేషమేమిటంటే అనుష్క స్క్రీన్ ప్రజెన్స్ కి సౌమ్య శర్మ డబ్బింగ్ చాలా ఆప్ట్ గా సింక్ అయింది.. దీంతో అనుష్క తర్వాత చేసిన లక్ష్యం సినిమాకి కూడా సౌమ్య శర్మని డబ్బింగ్ చెప్పింది.. ఈ సినిమాకి సౌమ్య శర్మకి బెస్ట్ ఫిమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా లభించింది .

- Advertisement -

ఇక ఈమె ఎవరో కాదు హీరో సిద్ధార్థ నటించిన ఓయ్ సినిమా దర్శకుడు ఆనంద్ రంగా భార్య.. 2017 ప్రేమ వివాహం చేసుకున్నారు ..ఇక వివాహం అనంతరం కూడా ఆమె డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే కొనసాగుతోంది. ఇక ఈమె డబ్బింగ్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు స్క్రిప్ట్ రైటర్ కూడా.. సరే జాను , అమెరికా అమ్మాయి లాంటి పాపులర్ టీవీ సీరియల్స్ కి స్క్రిప్ట్ రైటర్ గా కూడా పనిచేసింది. ఆర్. జే గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఇప్పుడు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది హీరోయిన్ల సక్సెస్ కి కారణం అయ్యింది అని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు