Vishwak Sen: అంతకంటే మంచి సినిమా చెయ్యాలని ఉంది

వెళ్ళిపోమాకే సినిమాతో దినేష్ నాయుడుగా తెలుగు పరిచయం అయ్యాడు విశ్వక్సేన్. ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. ఆ సినిమా తర్వాత విశ్వక్సేన్ నటించిన సినిమా ఈ నగరానికి ఏమైంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా యూత్ కి క్రేజీగా ఎక్కిందని చెప్పొచ్చు. అంతకుముందు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన పెళ్లి చూపులు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ నగరానికి ఏమైంది సినిమాకి మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఈ సినిమాలో కౌశిక్ పాత్రలో కనిపించిన విశ్వక్సేన్ కి మంచి పేరు వచ్చింది.

ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత విశ్వక్సేన్ లో ఉన్న మరో టాలెంట్ను బయటకు తీశాడు. అయితే ఫలక్నామా దాస్ సినిమాతో విశ్వక్సేన్ దర్శకుడుగా కూడా తన టాలెంట్ ను బయటకు తీశాడు. హీరో కంటే కూడా దర్శకుడుగా మంచి ప్రతిభ ఉందని కొన్ని ప్రశంసలు కూడా ఆ టైంలో వినిపించాయి. ఇప్పటివరకు విశ్వక్సేన్ రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే విశ్వక్సేన్ ఎప్పటినుంచో చేస్తున్న సినిమా గామి ఆ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

అలానే ప్రస్తుతం విశ్వక్సేన్ చేస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. రౌడీ ఫెలో సినిమాతో దర్శకుడుగా పరిచయమైన కృష్ణ చైతన్య ఆ తర్వాత ఛల్ మోహన్ రంగ సినిమాను చేశాడు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు కొన్నేళ్ళు గ్యాప్ తీసుకుని కృష్ణ చైతన్య మళ్ళీ దర్శకుడుగా ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ సినిమాపై కూడా అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది.

- Advertisement -

రీసెంట్ గా ఒక ప్రముఖ జర్నలిస్ట్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్వక్సేన్ ఒక విషయాన్ని చెప్పుకొచ్చాడు. తనకు బాగా ఇష్టమైన హీరో చేస్తున్న ఒక సినిమాలో మంచి పాత్రను తాను వదులుకున్నట్లు చెప్పుకొచ్చాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ క్యారెక్టర్ లా ఆ పాత్ర ఉండబోతుందని, ఆ పాత్రను తాను వదులుకున్నట్లు చెప్పుకొచ్చాడు విశ్వక్సేన్. అంతకంటే మంచి సినిమా ఆ హీరోతో చేయాల్సి ఉందని కూడా చెప్పుకొచ్చాడు.

అయితే విశ్వక్సేన్ కి ఇష్టమైన హీరో ఎన్టీఆర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ బర్త్డే కానుకగా ఒక సాంగ్ కూడా అప్పట్లో రిలీజ్ చేశాడు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం చేస్తున్న దేవర. ఈ సినిమాలోని ఒక రోల్ ను విశ్వక్సేన్ వదులుకున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంత అనేది విశ్వక్సేన్ మాటల్లో చెప్తే గాని ఖచ్ఛితంగా చెప్పలేం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు