Chiranjeevi: చిరు మెచ్చని.. పవన్ చెత్త మూవీ ఇదే..!

చాలామంది నటీనటులకు ఎక్కువగా ఇష్టమైన సినిమాలు ..ఇష్టం లేని సినిమాలు కూడా ఉంటాయి. అలా టాలీవుడ్లో మెగాస్టార్ గా పేరు సంపాదించిన చిరంజీవికి కూడా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ నటించిన ఒక సినిమా అంటే అసలు ఇష్టం లేదట.. ఆ సినిమాను చూసిన వెంటనే పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి మరీ చిరంజీవి తిట్టారట.. నీ ఫ్లాప్ సినిమాలకు కూడా ఏదైనా ఒక అర్థం ఉంటుంది .కానీ ఎలాంటి అర్థంపర్థం లేని ఒక సినిమాని ఎందుకు తీశావు ..నీ కెరియర్ లో చెత్త సినిమా అంటూ వుందంటే అది ఇదే అంటూ తెలిపారట.

ఇక మీదట ఇలాంటి చిత్రాలని అసలు చేయకు అంటూ సలహా ఇచ్చారటచిరంజీవి.. అయితే ఆ సినిమా ఏదో కాదు పవన్ కళ్యాణ్ నటించిన బంగారం చిత్రమే.. ఈ సినిమాకు ముందు పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ కూడా కాస్త మెప్పించాయి.. జానీ ముందు వరకు ఆయన కెరియర్లో ఎక్కువగా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. జానీ మూవీ నుండి పవన్ కళ్యాణ్ కి ఒక్కసారిగా ఫ్లాప్ లు చుట్టుముట్టాయి.. గుడుంబా శంకర్ ,బాలు ,బంగారం ఇలా ఎన్నో చిత్రాలు ఫ్లాప్ లుగానే మిగిలాయి.

తమిళంలో ఒక్కడు సినిమాను రీమిక్స్ చేసిన డైరెక్టర్ ధరణి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు..AM రత్నం ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. అయితే ఈ చిత్రాన్ని చూసిన చిరంజీవి.. డైరెక్టుగానే బాగాలేదని చెప్పేశారట.. అయితే పవన్ కళ్యాణ్ నాకు స్టోరీ విన్నప్పుడే నచ్చలేదు అన్నయ్య అంటూ అన్నారట ..ఇక డైరెక్టర్ మొహమాటం పెట్టడంతో చేయవలసి వచ్చింది అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారట.

- Advertisement -

అయితే ఈ విషయాలన్నీ పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్ లలో ఒకరైన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశారు. చిరంజీవికి నచ్చని సినిమా అని.. ఆడియన్స్ సైతం కూడా రిజెక్ట్ చేశారు. కానీ ఓపెనింగ్స్ లో అయితే ఆ రోజుల్లో బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది అప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా బద్దలు కొట్టి ఆల్ టైం నెంబర్ వన్ రికార్డ్ గా నిలిచింది .. దాదాపుగా ఈ సినిమా రూ .18 కోట్ల రూపాయల షేర్ ని సైతం రాబట్టినట్లు తెలుస్తోంది. మొత్తానికి అయితే చిరంజీవి ఈ సినిమా నచ్చలేదని చెప్పినా..కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు