Upasana: అత్తమ్మాస్ కిచెన్.. మా వంటగది నుండీ నేరుగా మీ ఇంటికి – ఉపాసన

సాధారణంగా అత్తా కోడలు అంటే ఎక్కడైనా సరే.. వేసిన పప్పులు ఉడకవు అని అంటారు.. కానీ ఈ అత్తా కోడలిని చూస్తే మాత్రం నిజంగా ముచ్చటేస్తుంది. అంతేకాదు వీరు ఎంతో మందికి ఆదర్శం కూడా.. ఇప్పటికే వారెవరో అర్థమైపోయి ఉంటుంది కదా.. నిజమే వారే కొణిదెల సురేఖ , కొణిదెల ఉపాసన.. వీరిద్దరూ అత్తా కోడలు కాదు తల్లి కూతుర్లు అనిపించేలా ఎంతో అన్యోన్యంగా ఎంతో మందికి ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు.. అలాంటి వీరిద్దరూ తాజాగా బిజినెస్ పార్ట్నర్స్ అయినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, కోడలు ఉపాసన కొత్త వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇక ఆ వివరాలను ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు..

నిన్న సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా “అత్తమ్మాస్ కిచెన్” పేరుతో తన అత్త బిజినెస్ లోకి అడుగుపెడుతున్నట్లు మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అంతేకాదు తమ కొత్త వ్యాపారం ద్వారా అత్త కోడలు ఇద్దరు కూడా కొణిదెల వారి వంటింటి రుచులను అందరికీ పరిచయం చేయబోతున్నట్లు కూడా స్పష్టం చేశారు.. “మా ఫ్యామిలీ అత్తమ్మాస్ కిచెన్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది రుచి సాంప్రదాయాలకు అనుగుణంగా మీరు ఉన్న చోటనే రుచుల మిశ్రమాన్ని అనుభవించండి. నేరుగా మా వంటగది నుండి మీ ఇంటికి” అంటూ ఉపాసన పెట్టిన వీడియోతో కూడిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారుతుంది. ఇకపోతే వాస్తవానికి చిరంజీవి షూటింగ్స్ నిమిత్తం నెలల తరబడి బయట ఉన్నప్పుడు ఇంటి రుచులు మిస్ కాకుండా సురేఖ ఇలాంటి మిశ్రమాలను ప్యాక్ చేసి ఇచ్చేవారట.. దాని నుండి ప్రేరణ ఈ బ్రాండ్ ప్రారంభానికి పునాది అని స్పష్టం అవుతుంది.

ఇకపోతే ఈ వెంచర్ లో ఉపాసన కీలక పాత్ర వహిస్తున్నట్లు సమాచారం. ఉపాసన షేర్ చేసిన పోస్ట్ వీడియో చూస్తే.. ఉప్మా, పొంగల్, పులిహోర, రసం మిశ్రమాలు అక్కడ కనిపించాయి. ఈ మిశ్రమాలతో మన వంటింట్లో రుచికరమైన వంటలు సులభంగా తయారు చేయవచ్చు.. కొణిదెల వారి రుచులను ఆస్వాదించవచ్చు కూడా.. ఈ ఉత్పత్తులను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు ఈ అత్తా కోడలు.. ముఖ్యంగా ఈ వెంచర్ సురేఖ , ఉపాసనల అనుబంధాన్ని మరింత సూచిస్తుంది.. మొత్తానికి కోడలు సహకారంతో సురేఖ కూడా బిజినెస్ రంగంలో అడుగులు వేస్తున్నట్లు చెప్పవచ్చు.. ఈ కొత్త వెంచర్ సక్సెస్ కావాలని ప్రతి ఒక్కరు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఇందులో సక్సెస్ అయితే చూడాలని మెగా అభిమానులే కాదు యావత్ ప్రేక్షకులు కోరుకుంటున్నట్లు సమాచారం.

- Advertisement -

https://www.instagram.com/reel/C3ezdhfBkHC/?utm_source=ig_web_button_share_sheet

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు