Siva Karthikeyan: శివ కార్తికేయన్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలు

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరోల జాబితాలో పేరు దక్కించుకున్న యంగ్ హీరో శివ కార్తికేయన్ ఇప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు. ముఖ్యంగా ఈయన చిన్న స్థాయి నుంచి ఎదిగిన విషయం తెలిసిందే.. కెరియర్ మొదట్లో మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన ఇప్పుడు భారీ చిత్రాలతో బిజీగా మారారు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాలతో అలరిస్తున్నారని చెప్పాలి. దాదాపు 12 ఏళ్లకు పైగా కోలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్న శివ కార్తికేయన్ హీరో గానే కాకుండా కమెడియన్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు..

ప్రస్తుతం విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాదు కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా మరింత దగ్గరవుతున్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా శివ కార్తికేయన్ నటించిన డాక్టర్ బాబు చిత్రం తెలుగు ఆడియన్స్ ను విపరీతంగా నచ్చేసింది. దీంతో ఈయనని తెలుగు ఆడియన్స్ ఓన్ చేసుకున్నారు. ఇటీవలే పాన్ ఇండియా చిత్రంగా అయలాన్ సినిమాను విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు శివ కార్తికేయన్. ఇకపోతే ప్రస్తుతం అమరన్ అనే సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో రీసెంట్గా SK 23 ప్రాజెక్టును కూడా ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల శివ కార్తికేయన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తమిళనాడు సంపాదన ఇండస్ట్రీలో హార్ట్ టాపిక్ గా మారింది.

ఇన్నేళ్లుగా శివ కార్తికేయన్ సినిమాల ద్వారా ఎంత సంపాదించారు అన్నది తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. నటుడిగా, నిర్మాతగా శివకార్తికేయన్ కోట్లలో సంపాదిస్తున్నారు.. వివిధ లగ్జరీకార్లు బంగ్లాలతో చాలా సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఇక మొత్తం ఆయన ఆస్తి విలువ రూ.250 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది. కమెడియన్ స్థాయి నుంచి హీరోగా ఎదిగి కోలీవుడ్ పరిధిలోనే సినిమాలు చేస్తూ ఇంత సంపాదించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఈయన చేసింది కేవలం 21 సినిమాలే అయినా ఈ రేంజ్ లో సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. ఇకపోతే ప్రస్తుతం ఈయన చేస్తున్న అమరన్ త్వరలో విడుదల కాబోతోంది. ఎస్కే 23 కూడా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఇందులో హీరోయిన్గా రుక్మిణి వసంత్ ను సెలెక్ట్ చేశారు. ఇక త్వరలోనే ఈ సినిమా సెట్ పైకి వెళ్ళనుంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు