Ayesha Takia : సినిమాలపై ఇంట్రెస్ట్ లేదు, నేను ఇలాగే ఉంటా… ట్రోల్స్ పై నాగ్ హీరోయిన్ ఘాటు రిప్లై

కొంతమంది హీరోయిన్లు తారాజువ్వలా దూసుకు వచ్చి మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీని సంపాదించుకుంటారు. అయితే ఆ తర్వాత హఠాత్తుగా సిల్వర్ స్క్రీన్ కు దూరమై తమ అభిమానులకు షాక్ ఇస్తారు. కనీసం వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఎవ్వరికీ తెలియనివ్వరు. కేవలం తమ కుటుంబానికే ప్రాధాన్యతనిస్తూ, ఫ్యామిలీ లైఫ్ తోనే సంతోషంగా ఉంటారు. కానీ ఫ్యాన్స్ మాత్రం వాళ్లు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని కోరుకుంటూ ఉంటారు.

బాలీవుడ్ బ్యూటీ ఆయేషా టాకియా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. చాలా కాలంగా సినీ పరిశ్రమకు, మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ బ్యూటీ తాజాగా ముంబై ఎయిర్పోర్ట్ లో కెమెరాల కంటికి చిక్కింది. ఆ ఫోటోలు కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయేషా లుక్ పై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాటికి ఆయేషా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

సాధారణంగా సినిమాల్లో ఉన్నప్పుడే ఫిట్నెస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు చాలామంది హీరోయిన్లు. ఒకవేళ సినిమాల నుంచి తప్పుకుంటే ఆ తర్వాత పూర్తిగా మారిపోతారు. తాజాగా ఆయేషా కూడా అలాగే మారడంతో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. దీంతో ఇంస్టాగ్రామ్ లో ఒక సుదీర్ఘ పోస్ట్ తో తనను విమర్శిస్తున్న వారందరికీ ఘాటుగా రిప్లై ఇచ్చింది. రెండు రోజుల క్రితం తన ఫ్యామిలీలో ఒక మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా ఉన్నపలంగా తాను గోవా వెళ్లాల్సి వచ్చిందని, అదే సమయంలో ఫ్లైట్ కు ఇంకా సమయం ఉండడంతో ఫాన్స్ తనను ఫోటోలు అడిగారని తెలిపింది.

- Advertisement -

ఇక తన గురించి వస్తున్న విమర్శల గురించి స్పందిస్తూ దేశంలో తన లుక్స్ గురించి చర్చించుకోవడం కంటే వేరే ముఖ్యమైన పనులేవీ లేవని తనకు అనిపిస్తోందని కౌంటర్ వేసింది. తను ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అనే జనాల అభిప్రాయాలు వైరల్ అవ్వడం తన దృష్టికి వచ్చిందని చెప్పుకొచ్చింది ఆయేషా. ఈ సందర్భంగానే తనకు కం బ్యాక్ ఇవ్వడంలో, సినిమాలు చేయడంలో ఎలాంటి ఆసక్తి లేదని, తనను ఇలాగే వదిలేయమని రిక్వెస్ట్ చేసింది.

అంతేకాకుండా ప్రస్తుతం తన జీవితాన్ని తాను చాలా సంతోషంగా గడుపుతున్నానని, లైమ్ లైట్ లో ఉండాలని తను అస్సలు అనుకోవడం లేదని తేల్చి చెప్పేసింది. అలాగే తనకి ఏ సినిమా లేదా ఫేమ్ అవసరం లేదని క్లారిటీ ఇచ్చింది. కాబట్టి ఇక చిల్ అవ్వండి. నా గురించి పట్టించుకోకుండా ఉండడానికి మీకు రైట్ ఉంది అంటూ ఇన్ డైరెక్ట్ గా ఎవరి పని వాళ్ళు చూసుకుంటే మంచిదని సెటైర్ వేసింది ఆయేషా. అక్కడితో ఆగకుండా ఒక అమ్మాయి టీనేజ్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఎప్పటికీ అలాగే ఉండాలనుకోవడం దారుణమని, అందమైన అమ్మాయిలను చూసి సమయాన్ని వేస్ట్ చేసుకోవడం కంటే ఉపయోగపడే పనులపై కాన్సెంట్రేట్ చేయండి అని సలహా ఇచ్చింది. తనకు ఒక అందమైన జీవితం దొరికిందని, మీ అభిప్రాయాలు ఇక నాకు అవసరం లేదని, అవసరమున్న వారి కోసం వాటిని దాచి పెట్టండి అంటూ నెటిజెన్లకు గట్టిగా ఇచ్చి పడేసింది. కాగా టాలీవుడ్ లో ఈ అమ్మడు నాగార్జునతో కలిసి “సూపర్” మూవీలో నటించింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు