Kriti Karbanda : ప్రియుడితో పవన్ హీరోయిన్ పెళ్లి… డేట్ ఫిక్స్

సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది సీనియర్ హీరోయిన్లంతా వరుసగా పెళ్లి బాట పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రకుల్ తన ప్రియుడు జాకీ భగ్నానితో ఫిబ్రవరి 24న వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతూ ఉండగా, గోవాలో వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. త్వరలోనే తమన్నా కూడా పెళ్లి బంధంలోకి ఎంటర్ అవ్వబోతోంది అని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మరో బాలీవుడ్ బ్యూటీ కృతి కర్బందా పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతోంది. ఈ ఢిల్లీ భామ టాలీవుడ్ ఆడియన్స్ కు కూడా సుపరిచితురాలే. తెలుగులో మంచు మనోజ్ తో మిస్టర్ నూకయ్య, రామ్ పోతినేని తో కలిసి ఒంగోలు గిత్త, పవన్ కళ్యాణ్ తో తీన్మార్ అనే సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది. అయితే స్టార్ హీరోలతో కలిసి నటించినప్పటికీ ఈ అమ్మడికి స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం దక్కలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న కృతి ఎట్టకేలకు తన ప్రియుడితో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టడానికి రెడీ అయింది.

చాలా రోజుల క్రితమే కృతి కర్బందా, బాలీవుడ్ నటుడు పుల్కిత్ సామ్రాట్ తమ ప్రేమ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ ప్రేమ పెళ్లిగా మారే సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. పెద్దల ఆశీర్వాదంతో ఈ లవ్లీ కపుల్ పెళ్ళికి రెడీ అవుతున్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇప్పటికే వీళ్ళ పెళ్లికి ముహూర్తం కూడా ఖరార్ అయిందని వారి సన్నిహితులు అంటున్నారు. మార్చి 13న కృతి, పుల్కిత్ పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు సమాచారం. అయితే ఇటు కృతి గానీ, అటు పుల్కిత్ గానీ తమ పెళ్లి గురించి ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు. రీసెంట్ గా వాలెంటెన్స్ డే రోజున కృతి తన ప్రియుడు పుల్కిత్ సామ్రాట్ తో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేసి పెళ్లిపై హింట్ ఇచ్చింది. “లెట్స్ మార్చ్ టు హ్యాండ్ హ్యాండ్” అంటూ దానికి ఆమె క్యాప్షన్ ఇవ్వగా, పెళ్లి గురించి ఇన్ డైరెక్ట్ గా చెప్పడానికే అందులో మార్చ్ అనే పదాన్ని వాడారని అభిమానులు అనుకుంటున్నారు. ఇక మార్చి 13కు పెద్దగా సమయం లేకపోవడంతో పెళ్లి ఏర్పాట్లు షురూ అయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ జంట పెళ్లి వేదిక గురించిన సమాచారం మాత్రం ఇంకా బయటకు రాలేదు.

వీరే ది వెడ్డింగ్, పాగల్ పంతి, తైష్ వంటి సినిమాల్లో కృతి, పుల్కిత్ సామ్రాట్ కలిసి నటించారు. 2019 నుంచి వీరిద్దరూ ప్రేమాయణం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ పుల్కిత్ కు ఇప్పటికే పెళ్లై తన మొదటి భార్యతో విడిపోయారు. 2014లో శ్వేత రోహిరాను పుల్కిత్ వివాహం చేసుకున్నారు. 2018లో ఈ జంట విడిపోయారు. ఆ తర్వాత ఏడాదికే కృతి, పుల్కిత్ ప్రేమలో పడ్డారు. ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు