Taraka Ratna Birth Anniversary: ఆ చిన్న తప్పే తారక రత్న సినీ కెరీర్ ను నాశనం చేసిందా?

దివంగత నటుడు నందమూరి తారకరత్న గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నందమూరి వంశం నుంచి వారసుడిగా తెలుగు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తారకరత్న అప్పట్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిపోయాడు. కానీ హీరోగా పీక్స్ లో స్టార్డం ఉన్న సమయంలోనే హఠాత్తుగా ఆయన సినిమా కెరియర్ కు బ్రేక్ పడింది. దానికి కారణం సినిమాల విషయంలో ఆయన చేసిన ఓ చిన్న తప్పే. ఈరోజు నందమూరి తారకరత్న బర్త్ యానివర్సరీ సందర్భంగా ఆయన సినీ కెరీర్ నాశనం అవ్వడానికి గల కారణం ఏంటి? అన్న విషయాన్ని తెలుసుకుందాం.

1983 ఫిబ్రవరి 22న నిమ్మకూరులో మోహన కృష్ణ, శాంతి దంపతులకు తారకరత్న జన్మించాడు. తాత నందమూరి తారక రామారావు, పెదనాన్న హరికృష్ణ, బాబాయ్ బాలకృష్ణ వంటి వారి నట వారసత్వంతో ఒకటో నెంబర్ కుర్రాడు అనే సినిమాతో హీరోగా లాంచ్ అయ్యాడు. రెండవ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో, మొదటి సినిమాతోనే సక్సెస్ అయిన హీరోగా రికార్డును క్రియేట్ చేశాడు. ఆ సినిమాతో దక్కిన పాపులారిటీతో ఒకేరోజు ఏకంగా తొమ్మిది విభిన్నమైన సినిమాలను స్టార్ట్ చేసి సినీ చరిత్రలోనే మరెవ్వరూ టచ్ చేయలేని చరిత్రను సృష్టించాడు. అయితే ఆ తొమ్మిది సినిమాల్లో విడుదలైంది కొన్ని సినిమాలే అయినప్పటికీ ఈ అరుదైన రికార్డు మాత్రం చెక్కుచెదరలేదు. ఆ తర్వాత యువరత్న, తారక్ , నో, భద్రాద్రి రాముడు, అమరావతి వెంకటాద్రి, ముక్కంటి, నందీశ్వరుడు, విజేత, ఎదురులేని అలెగ్జాండర్, చూడాలని చెప్పాలని మహా భక్త సిరియాల, కాకతీయుడు, ఎవరు, మనమంతా, రాజా చేయి వేస్తే, ఖయ్యూం భాయ్, దేవినేని, సారధి వంటి సినిమాల్లో నటించాడు. అలాగే నైన్ అవర్స్ అనే వెబ్ సిరీస్ లో పోలీస్ పాత్రలో నటించి ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇన్ని సినిమాలు చేసినప్పటికీ ఆయన స్టార్ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు.

దానికి కారణం సినిమాల ఎంపికలో తారకరత్న సరైన కేర్ తీసుకోకపోవడం. ఇంత బ్యాగ్రౌండ్ ఉండి, నటుడిగా సక్సెస్ అయినప్పటికీ సరైన కథలను ఎంచుకోకపోవడంతో తారక రత్న కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో ఆ తర్వాత అవకాశాలు రాక విలన్ గా కూడా అవతారం ఎత్తారు. అమరావతి అనే సినిమాలో విలన్ పాత్రకు నంది అవార్డును అందుకున్నాడు. ఇక ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లో కూడా యాక్టివ్ గా మారాలనుకున్నాడు. దీంతో 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని, అసెంబ్లీకి పోటీ చేయాలని తారకరత్న అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా కన్నుమూశాడు. ఇక ఆయన ఫ్యామిలీ విషయానికి వస్తే… ప్రస్తుతం భార్య అలేఖ్య, నిష్కా అనే పాప, కవల పిల్లలు తనయ్ రామ్, రేనా ఉన్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు