Siddharth Roy : అర్జున్ రెడ్డికి, సిద్ధార్థ్ రాయ్ కి మ్యూజిక్ డైరెక్టరే ప్రాబ్లమా?

ఆర్య, అతడు వంటి స్టార్ హీరోల సినిమాల్లో బాల నటుడిగా నటించి మెప్పించిన దీపక్ సరోజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. “సిద్ధార్థ్ రాయ్” అనే మూవీతో ఫిబ్రవరి 23న థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ యశస్వి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, మ్యూజిక్ డైరెక్టర్ రధన్ సంగీతం అందించారు. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ యశస్వి ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ రధన్ “అర్జున్ రెడ్డి” వంటి బ్లాక్ బస్టర్ మూవీకి సంగీతం అందించారు. అయితే ఆ సమయంలో కూడా ఈయనపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇలాంటి ఆరోపణలే చేయడం గమనార్హం. తాజాగా “సిద్ధార్థ్ రాయ్” డైరెక్టర్..? మ్యూజిక్ డైరెక్టర్ గురించి చేసిన ఆరోపణలు ఏమిటి? అంటే…

మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “సిద్ధార్థ రాయ్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ స్టేజ్ పైనే డైరెక్టర్ యశస్వి మ్యూజిక్ డైరెక్టర్ రధన్ పై ఫైర్ అయ్యారు. “సిద్ధార్థ్ రాయ్” మూవీ ఆలస్యం కావడానికి మ్యూజిక్ డైరెక్టర్ రధన్ కారణమని, ఆయన చేతుల్లో పడితే సినిమాను నలిగిపోతుందని, గొడవ పడడానికే రధన్ మాట్లాడతాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ త్వరగానే అయిపోయిందని, కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం అవుతూ వచ్చాయని, దానికి ముఖ్య కారణం రధన్ అనే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పిన యశస్వి, తనలాగా ఎవ్వరూ మోసపోకూడదని ఈ విషయాన్ని బయట పెడుతున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. చెన్నైకి సిట్టింగ్ కు రావాలని అపాయింట్మెంట్ అడిగానని, కానీ రాజమండ్రిలో ఉన్నప్పుడు రధన్ ఫోన్ వస్తే ఆ ఫోన్ కాల్ ముగిసేసరికి వైజాగ్ వచ్చేసిందని, అంతలోపు ఎంత వాదన జరిగి ఉంటుందో ఊహించుకోవచ్చు అంటూ తనకు అతని వల్ల జరిగిన చేదు అనుభవాన్ని బయటపెట్టారు. ఆయన మ్యూజిక్ ఎంత బాగా చేస్తాడో తెలియదు గానీ సినిమాను చివరకు తీసుకెళ్లి వదిలేస్తాడని, రధన్ చెన్నైలోనే ఉండి బతికి పోయాడని తాను అనుకుంటున్నానని, ఒకవేళ అతను ఇక్కడ ఉంటే చాలా గొడవలు అయ్యి ఉండేవని డైరెక్టర్ యశస్వి మండిపడ్డారు.

అర్జున్ రెడ్డి” సినిమా సమయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా మ్యూజిక్ డైరెక్టర్ రధన్ తనను ఇబ్బంది పెట్టారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. “అర్జున్ రెడ్డి” సినిమాను వదిలేస్తే ఏం చేస్తావని రధన్ తనను బెదిరించాడని, కానీ తనకు మొదటి సినిమా కావడంతో ఏమీ అనలేకపోయానని అప్పట్లో సందీప్ వెల్లడించారు. ఇక ఇప్పుడు “అర్జున్ రెడ్డి”కి కాపీ అనే కామెంట్స్ మధ్య విడుదలవుతున్న “సిద్ధార్థ్ రాయ్” సినిమాకు కూడా మ్యూజిక్ డైరెక్టర్ రధనే ప్రాబ్లం కావడం గమనార్హం.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు