Bharateeyudu2 : సమ్మర్ బరిలో ఇండియన్ ని దింపుతున్న శంకర్?.. ఇది జరిగితేనే దానిపై ఫుల్ ఫోకస్!

ఇండియన్ జేమ్స్ కేమెరూన్ శంకర్ షణ్ముగం ప్రస్తుతం తన కెరీర్ లోనే ఎక్కువ శ్రమిస్తున్నాడు అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నడూ లేనట్టు ఒకేసారి రెండు సినిమాలు సెట్స్ పై ఉంచి పనిచేస్తున్నాడు. అప్పుడెప్పుడో ఐదేళ్ల కిందట ఇండియన్ 2 ని మొదలెట్టాడు శంకర్. ఆ సినిమాకి ఫైనాన్షియల్ ఇష్యూస్ తో పాటు, సెట్స్ లో ప్రమాదం చోటు చేసుకోవడంతో ఆగిపోయింది. ఆ తరవాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో దిల్ రాజు నిర్మాణం లో గ్రాండ్ గా గేమ్ ఛేంజర్ ని స్టార్ట్ చేశారు. ఇక ఈ సినిమా కూడా ఆల్మోస్ట్ మూడేళ్లగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. అయితే ఆరు నెలల కింద అన్ని అడ్డంకులు తొలగి ఇండియన్ 2 ని మళ్ళీ చేయగా, షూటింగ్ తుది దశకు చేరుకుందని సమాచారం. అయితే ఈ ఇండియన్ 2 ని 2024 సంక్రాంతికి తెద్దామని ప్లాన్ చేసినా షూటింగ్ బాకీ ఉండడంతో కుదరలేదు. ఇక తెలుగులో భారతీయుడు2 పేరుతో రిలీజ్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే.

అయితే ఎన్ని సమస్యలొచ్చినా భారతీయుడు2 సినిమాని సమ్మర్ లో తీసుకురావాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. బహుశా మే మొదటివారం లేదా రెండో వారంలో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఎండింగ్ కి వచ్చినా, శంకర్ సినిమా అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్, అలాగే ప్రమోషన్లకు ఎంత టైం తీసుకుంటాడో తెలిసిందే. దీన్ని బట్టి రిలీజ్ కి కనీసం నెల రోజుల ముందు మొత్తం షూటింగ్ పూర్తయితే తప్ప ప్రమోషన్స్ చేయడం కష్టం. అదీ గాక భారతీయుడు2 రిలీజ్ అయితేనే శంకర్ పూర్తి ఫోకస్ గేమ్ ఛేంజర్ పై పెట్టే అవకాశం ఉంది. ఇటు రామ్ చరణ్ సినిమాని కూడా దిల్ రాజు దసరా కి ఖచ్చితంగా రిలీజ్ చేయాల్సిందేనని శంకర్ పై ప్రెజర్ పెడుతున్నాడు.

ఇక కమల్ హాసన్ కూడా ఇండియన్ 2 కోసమే మణిరత్నం సినిమాకి బ్రేక్ ఇచ్చాడు. అందుకే శంకర్ షూటింగ్ కి గ్యాప్ కూడా తీసుకోకుండా కష్టపడుతున్నాడు. ఇక భారతీయుడు2 ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ ఆల్రెడీ కొన్ని చోట్ల బిజినెస్ కూడా చేసారు. ఈ సినిమా యొక్క డిస్ట్రిబ్యూషన్ హక్కులలో, తెలుగులో నైజాం రైట్స్ ని ఏషియన్ సినిమాస్ వారు సొంతం చేసుకున్నారని సమాచారం.అయితే అందరూ ఇండియన్2 ని మే లో దించితే తెలుగులో పోటీ కూడా భారీగా ఉండే ఛాన్స్ ఉంది. అదే నెలలో ప్రభాస్ కల్కి2989AD వస్తుండగా , పలు మీడియం రేంజ్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ అడ్డంకులన్నీ దాటుకుని శంకర్ మే కల్లా భారతీయుడు2 ని రెడీ చేస్తాడా అనేది చూడాలి.

- Advertisement -

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు