Bellamkonda Sreenivas : బెల్లంకొండ నెక్స్ట్ మూవీ ఆ బ్యానర్ లోనే?

టాలీవుడ్ లో నిర్మాతల కొడుకులుగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హీరోలలో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకరు. పదేళ్ల కింద అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఇంతకు ఫస్ట్ మూవీతో యావరేజ్ సక్సెస్ ని అందుకోగా పాస్ మార్కులు వేయించుకున్నాడు. అయితే సక్సెస్ మాత్రం ఇతడ్ని ఇప్పటి వరకూ పలకరించలేదు. ఆ మధ్య రాక్షసుడు సినిమాకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. కానీ లాస్ట్ ఇయర్ నటించిన ఛత్రపతి హిందీ రీమేక్ తో ఉన్న పరువు కూడా పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఈ బెల్లంకొండ కుర్రాడికి హిట్టు కొట్టక తప్పని పరిస్థితి. అందుకే అటు డైరెక్టర్ల నుంచి, ఇటు నిర్మాతల నుంచి కథలు వింటూ ప్రాజెక్టులు ఒకే చేస్తూ వరుస సినిమాలు లైన్లో పెడుతున్నాడు.

ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ టైసన్ నాయుడు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో బెల్లంకొండ ఒక డీఎస్పీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. రీసెంట్ గా వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా శ్రీనివాస్ మరో ప్రాజెక్టుని కూడా లైన్లో పెట్టాడని సమాచారం. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సాహు గారపాటి తో ఓ చిత్రం ఫైనల్ అయిందని సమాచారం. షైన్ స్క్రీన్ బ్యానర్ లో తెరకెక్కబోయే ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ మీదకు వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే డైరెక్టర్ ఎవరన్నదానిపై క్లారిటీ లేదు. కానీ ప్రస్తుతం చేస్తున్న టైసన్ నాయుడు సినిమా రిలీజ్ తర్వాతే ఈ సినిమా మొదలవుతుందని సమాచారం.

అయితే హిట్లు లేకపోయినా వరుస ప్రాజెక్టులు లైన్లో పెట్టడం బెల్లంకొండ వారసుడికి ఇప్పుడు కలిసొచ్చినా, ముందుముందు సక్సెస్ లేకపోతే సైడ్ అయిపోవాలి, లేదా సైడ్ క్యారెక్టర్లు చేయాలి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమా ఏదైనా మంచి కథాబలం ఉన్న స్క్రిప్ట్ లను ఎంచుకుని సక్సెస్ కొట్టినప్పుడే అసలైన గుర్తింపు వస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. పైగా బెల్లంకొండ వారసుడికి పెర్ఫార్మన్స్ విషయంలో ఇప్పటికీ పలు విమర్శలున్నాయి. వాటన్నిటికీ చెక్ పెట్టాలంటే హిట్టు కొట్టాల్సిందే.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు