Koratala Siva : దేవర లో ఆ సాంగ్ హైలెట్ అట..

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న “దేవర” సినిమాకోసం నందమూరి అభిమానులు ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండేళ్ల కింద స్టార్ట్ అయిన ఈ సినిమా ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. 2024 లో సమ్మర్ లో వస్తుందని ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ మూవీ మేకర్స్, షూటింగ్ డిలే కావడంతో సమ్మర్ నుండి దసరాకి షిఫ్ట్ చేసారు. అక్టోబర్ 10న దేవర ని రిలీజ్ చేస్తున్నట్టు కొన్ని రోజుల కిందే మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఫస్ట్ పార్ట్ అక్టోబర్ లో రిలీజ్ కి రెడీ అవుతుండగా, రీడు పార్ట్ 2025 సమ్మర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

ఇదిలా ఉండగా దేవర సినిమాలో సాంగ్స్ హైలెట్ గా ఉండబోతున్నాయని టాక్ నడుస్తుంది. తాజాగా మేకర్స్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం దేవర సినిమాలో ఆయుధ పూజ సాంగ్ హైలెట్ గా నిలవబోతుందని సమాచారం. అయితే ఆ సాంగ్ ఇంకా షూట్ చేయలేదట. త్వరలోనే వారం రోజుల షెడ్యూల్ లో ఆ సాంగ్ ని షూట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆ సాంగ్ ని బీచ్ దగ్గర షూట్ చేయాలా? లేక హైదరాబాద్ లోనే సెట్ వేసి విజువల్స్ తో షూట్ చేయాలా అని కన్ఫ్యూజన్ లో పడ్డారట కొరటాల శివ.

అయితే ఏది ఏమైనా ఈ మార్చి లో ఆ పాట షూట్ చేయనున్నారని సమాచారం. ఇక ఆ సాంగ్ సినిమాకే ఒక హై ఇవ్వబోతుందట. హై వోల్టేజ్ ఆక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 ను విజయదశమి కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించడం జరిగింది. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడని తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ ఈ సినిమాని 200 కోట్లకి పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు