Kunal Singh: కెరియర్ పోయింది.. కట్టుకున్న భార్య దూరమైంది.. చివరికి..?

తెలుగు సినీ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలలో నటించిన హీరోలలో హీరో కునాల్ సింగ్ కూడా ఒకరు.. ఈ హీరో నటించిన మొదటి చిత్రం కాదల్ దినం.. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేమికుల రోజు పేరుతో డబ్ చేసి విడుదల చేశారు.. అయితే ఇందులో హీరోయిన్ గా సోనాలి బింద్రే నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.. ముఖ్యంగా ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాయి. అందుకే ఈ చిత్రంలోని పాటలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ ని అందుకున్నాయి. సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.

దీంతో కునాల్ సింగ్ కు వరుసగా అవకాశాలు వెలువడ్డాయి. అయితే తను చేసిన తప్పటడుగుల వల్ల హిట్స్ కన్నా ఎక్కువగా ఫ్లాపులని మూట కట్టుకున్నారు. దీంతో ఎన్నో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ అవి కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి.. మరి కొన్ని సినిమాలు షూటింగ్ జరిగినా కూడా విడుదలకు నోచుకోలేదట. కేవలం ఐదేళ్ల లోపే తన కెరియర్ మొత్తం పడిపోయింది.. 2007లో చివరిగా నంబనిన్ కాదలై అనే చిత్రంలో నటించారు.. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో యాక్టర్ గా రాణించడం కష్టమే అనుకున్నారట.

అలా మళ్లీ అసిస్టెంట్ డైరెక్టర్ గా అవుతారమెత్తారు.. మళ్లీ ఆ తర్వాత నిర్మాతగా కూడా మారారు కునాల్ సింగ్.. నటి లావిణ పంకజ్ భాటియా తో చాలా స్నేహంగానే మెదిలే వాళ్ళని అప్పట్లో ప్రచారం కూడా జరిగింది.. అప్పటికే కునాల్ కు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. అతడి ప్రేమ విషయం కునాల్ భార్య అనురాధకు తెలియడంతో దీని గురించి తరచూ వీరిద్దరి మధ్య గొడవలు కూడా జరిగేవట. అలా కునాల్ సింగ్ మీద కోపంతో ఆమె ఇల్లు విడిచి పుట్టింటికి వెళ్ళిపోయింది..

- Advertisement -

ఈ విషయాలు అన్నిటిని భరించలేక కునాల్ సింగ్ ఎన్నోసార్లు మనస్థాపానికి గురయ్యారు.. 2008 ఫిబ్రవరి 7 న తన అపార్ట్మెంట్లో ఉరివేసుకొని మరణించారు. అయితే ఈ విషయం జరగడానికి కొన్ని గంటల ముందు ఒక సినిమా షూటింగ్స్ స్క్రిప్ట్ పనులలో కాస్ట్యూమ్ డిజైనర్ నటి పంకజ్ తో తన ఇంట్లోనే చర్చలు జరిపారట.. అందరూ వెళ్లిపోయిన తర్వాత పంకజ్ అక్కడే ఉన్న వాష్ రూమ్ని ఉపయోగించుకుందామని వెళ్లగా అంతలోనే కునాల్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నట్లు కనిపించారు.. పంకజ్ కు కునాల్ కు మధ్య ఏదో గొడవ జరిగిందని..ఆ ఆవేశంతోని ఇంతటి అఘాయిత్యానికి కునాల్ పాల్పడ్డారని వార్తలు కూడా వినిపించాయి..

ఈ కేసులో పంకజ్ భాటియాను కూడా అదుపులోకి తీసుకొని విచారించారు.. కానీ చివరికి అది ఆత్మహత్య అని తేలింది. గతంలో కూడా రెండుసార్లు కునాల్ చనిపోవాలని ప్రయత్నించారట.. ఒకవైపు కెరియర్ నాశనం మరొకవైపు సంసార జీవితం సరిగ్గా లేకపోవడంతో.. నిర్మాతగా అప్పులు పాలు అవడం చేత 31 ఏళ్ల వయసులోనే కునాల్ సింగ్ మరణించారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు