Article 370 Movie Ban : హిందీ సినిమాలు ఆ దేశాల్లో బ్యాన్… “ఆర్టికల్ 370” కూడా… 

ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ తో పాపులర్ అయిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ “ఆర్టికల్ 370”. ఆమె ఇందులో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటించగా, “ఆర్టికల్ 370” సినిమాను ఆమె భర్త ఆదిత్య ధర్ నిర్మిస్తుండడం విశేషం. ప్రియమణి కీలకపాత్రలో నటించగా, “రామాయణ్” ఫేమ్ అరుణ్ గోవిల్ ఈ సినిమాలో నరేంద్ర మోడీ పాత్రను పోషించారు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు ప్రధాన అంశంగా ఈ మూవీ రూపొందింది. భారత ప్రభుత్వం 2019 ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్ కు ఉన్న స్పెషల్ స్టేటస్ ను తొలగించి, వాటిని కూడా టెర్రెటరిలో కలిపేసింది. ఈ మూవీకి ఆదిత్య సుహాస్ జంబాలే దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 23న రిలీజ్ అయిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓవర్సీస్ లో సైతం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ మూవీకి గల్ఫ్ దేశాల్లో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. అక్కడ “ఆర్టికల్ 370” మూవీని బ్యాన్ చేశారు.

కేవలం ఈ మూవీనే కాదు రీసెంట్ గా రిలీజ్ అయిన కొన్ని ఇండియన్ సినిమాలకు గల్ఫ్ దేశాల్లో ఇలాంటి చిక్కులే ఎదురయ్యాయి. మమ్ముట్టి, జ్యోతిక జంటగా నటించిన “కాతల్ ది కోర్” అనే సినిమా కూడా బ్యాన్ అయ్యింది. ముఖ్యంగా హిందీ సినిమాలకు ఈ పరిస్థితి తప్పట్లేదు. ఈ సినిమాలో మమ్ముట్టి హోమో సెక్సువల్ పాత్రను పోషించడనే కారణంతో అలా చేశారు. అది గల్ఫ్ దేశాల్లో చట్ట విరుద్ధం కాబట్టి తప్పలేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన “ఫైటర్”ను కూడా అక్కడ బ్యాన్ చేశారు. ఇందులో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ సన్నివేశాలు ఉండడమే అందుకు కారణం. ఇలాంటి వివాదాస్పద అంశాలు ఉన్న మూవీస్ కు కూడా అక్కడ రూల్స్ ప్రకారం నో ఎంట్రీ బోర్డు ఉంటుంది. కానీ దానివల్ల “ఫైటర్”కు 50 కోట్ల వరకు భారీ నష్టమే వచ్చింది.

ఇక ఇప్పుడు “ఆర్టికల్ 370” మూవీని కూడా అక్కడ రిలీజ్ చేయడానికి గల్ఫ్ దేశాలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. వాస్తవానికి గల్ఫ్ దేశాల్లో హిందీ సినిమాలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంటుంది. కానీ మంచి థ్రిల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే “ఫైటర్”, “ఆర్టికల్ 370” ఇలాంటి సినిమాలు అక్కడ బ్యాన్ అవ్వడం పట్ల చాలామంది మూవీ లవర్స్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. “ఆర్టికల్ 370” అనేది దాని చుట్టూ జరిగిన రాజకీయ మార్పులు, కాంట్రవర్సీల నేపథ్యంలో రూపొందింది. అయినప్పటికీ గల్ఫ్ దేశాలు మాత్రం ఈ మూవీని అక్కడ స్క్రీనింగ్ వేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడం గమనార్హం.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు