Varun Tej: కళ్యాణ్ బాబాయ్ , రామ్ చరణ్ కలిసి నన్ను ఏడిపించేవారు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వారసత్వం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్న చాలామంది సీనియర్ హీరోలు ఒకప్పుడు హీరోల వారసత్వం వలన వచ్చిన వాళ్ళే. ఇప్పుడున్న సీనియర్ హీరోస్ అంటే మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున వీరి అందరిని చెప్పుకుంటూ వస్తాం. వీరందరిలో మెగాస్టార్ చిరంజీవి మినహాయిస్తే, మిగతా వారందరికీ కూడా వారసత్వపు బ్యాగ్రౌండ్ ఉంది.

అలానే ఇప్పుడున్న జనరేషన్స్ లో మెగా ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోస్ వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి మొదటగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎంట్రీ చేశారు. పవన్ కళ్యాణ్ మెగాస్టార్ పేరుని సినిమా తన ఓపెనింగ్ కి మాత్రమే యూస్ చేసుకొని, తర్వాత తనంతట తాను కష్టపడి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఇప్పుడు పర్టిక్యులర్ గా పవన్ కళ్యాణ్ కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

మెగాస్టార్ తనయుడుగా చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్ తేజ్. ఆ సినిమా తోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకొని మంచి మంచి సినిమాలు ఎన్నుకుంటూ ఇండస్ట్రీలో తనకు తానుగా నిలదొక్కుకున్నాడు రామ్ చరణ్ తేజ్.

- Advertisement -

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి మరో బ్రదర్ నాగబాబు. నాగబాబు గురించి ప్రత్యేకంగా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రల్లో సినిమాల్లో కనిపించిన కూడా నాగబాబుకి మంచి గుర్తింపు తెచ్చిన మాత్రం జబర్దస్త్ షో అని చెప్పొచ్చు. ఆ షో గుర్తింపు తెచ్చినంతగా నాగబాబుకి ఇంకేది గుర్తింపు తీసుకురాలేదనేది వాస్తవం.

నాగబాబు తనయుడుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. మొదటి సినిమాతోనే తనకంటూ మంచి పేరు సాధించుకొని, తనలోని టాలెంట్ ని బయటికి తీసి అందరిలా కాకుండా వైవిధ్యమైన సినిమాలుని ఎన్నుకుంటూ, ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందుకుంటూ హీరోగా నిలదొక్కుకున్నాడు. వరుణ్ తేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్నిసార్లు వరుణ్ తేజ్ చేసిన సినిమాలు ఫెయిల్ అయినా, వరుణ్ తేజ్ మాత్రం కొత్త ఎక్స్పరిమెంట్ చేయడంలో మాత్రం ఫెయిల్ కాలేదు.

వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా “ఆపరేషన్ వాలెంటైన్”. ఈ సినిమా మార్చి 1న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో ప్రమోషన్స్ లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు వరుణ్ తేజ్. అయితే ఒక ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ కి ఒక ప్రశ్న ఎదురైంది. పవన్ కళ్యాణ్ గారితో ఉన్న ఎవరికీ తెలియని ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పండి. అన్నప్పుడు ఒక విషయాన్ని షేర్ చేశాడు వరుణ్ తేజ్.

వరుణ్ తేజ్ చిన్నతనంలో మెగాస్టార్ చిరంజీవి thumbs-up యాడ్ లను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను పెప్సీ యాడ్ లను చేసే వాళ్ళని. అయితే మెగాస్టార్ వైపు తను సపోర్ట్ గా ఉండేవాడిని అని. బాబాయ్ వైపు సపోర్ట్ గా రామ్ చరణ్ ఉండేవాడిని చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి లేని తరుణంలో కళ్యాణ్ బాబాయ్ మరియు చరణ్ అన్న కలిపి నన్ను ఒక రూమ్ లో పెట్టి లైట్స్ ఆఫ్ చేసి ఏడిపించే వారిని చెప్పుకొచ్చాడు వరుణ్ తేజ్.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు