Chiranjeevi : మెగాస్టార్ కాస్ట్లి వాచ్ ధర తెలిస్తే గుండె జారిపోవాల్సిందే!

స్టార్ హీరోలు అనగానే పైకి నిరాడంబరంగా కనిపించినప్పటికీ వాళ్ళ లగ్జరీ లైఫ్ కళ్ళు చెదిరేలా ఉంటుంది. కళ్ళ అద్దాల నుంచి కాళ్ళ చెప్పుల దాకా ప్రతిదీ బ్రాండెడ్ గానే ఉంటుంది. వాళ్లు వేసుకునే ప్రతి వస్తువు యవ్వారం లక్షలు, కోట్లలోనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి పెట్టుకున్న వాచ్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మరి ఆ వాచ్ ధర ఎంత? అసలు మెగాస్టార్ దగ్గర ఉన్న వాచ్ కలెక్షన్స్ ఏంటి? అనే ఆసక్తికరమైన వివరాల్లోకి వెళితే…

చిరు వాచ్ ధర అరకోటి…
ఎక్కడ కనిపించినా చాలా సింపుల్ గా కనిపించే మెగాస్టార్ చిరంజీవి తాజాగా పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే గుండె జారిపోవాల్సిందే. పద్మ విభూషణ్ బిరుదుతో చిరంజీవి గెస్ట్ గా హాజరైన మొట్టమొదటి ఈవెంట్ “ఆపరేషన్ వాలెంటైన్” ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి పెట్టుకున్న వాచ్ పై ఆయన అభిమానుల కన్ను పడింది. దీంతో అది ఏ బ్రాండెడ్ వాచ్? దాని ధర ఎంత అన్న విషయాలు ఆరా తీయడం మొదలుపెట్టారు. మొత్తానికి దాని ధర పట్టేసి, సోషల్ మీడియాలో పెట్టేశారు. ఇక చిరు ధరించిన ఆ వాచ్ ధర ఏకంగా అరకోటి అని తెలుసుకున్న సినీ ప్రియులు షాక్ అవుతున్నారు. మెగాస్టార్ ధరించిన ఆ కాస్ట్లీ వాచ్ ఏ.లాంజ్ & సోహ్నే అనే బ్రిటిష్ కంపెనీకి చెందిన బ్రాండ్. దీని ధర ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 50,56,747 అని సమాచారం. సింపుల్ గా ఉన్న ఈ వాచ్ ధర ఈ రేంజ్ లో ఉందని తెలుసుకున్న నెటిజన్లు ఆ డబ్బుతో ఒక పేద ఫ్యామిలీ జీవితాంతం హ్యాపీగా బ్రతికేయొచ్చు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Megastar Chiranjeevi Watch Collection...Operation Valentine Movie Event

- Advertisement -

చిరు వాచ్ కలెక్షన్స్…
మెగాస్టార్ చిరంజీవి దగ్గర ఉన్న కాస్ట్లీ వాచ్ లలో ఏ.లాంజ్ & సోహ్నే బ్రాండ్ లతో పాటు రోలెక్స్ వంటి భారీ ధర ఉన్న వాచ్ లు ఉన్నాయి. రక్షాబంధన్ సందర్భంగా మెగాస్టార్ పెట్టుకున్న వాచ్ ధర కూడా అప్పట్లో తెగ వైరల్ అయింది. ఆయన ధరించిన ఆ వాచ్ రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటోనా వైట్ టైగర్ అనే బ్రాండ్ కు సంబంధించింది. దాని ధర 2.35 లక్షల డాలర్లు, ఇండియన్ కరెన్సీలో దాదాపు 2 కోట్లు. ఈ రెండు మాత్రమే కాకుండా చిరు దగ్గర మరికొన్ని కాస్ట్లీ బ్రాండెడ్ వాచీలు ఉన్నాయి. తనకు కార్ల కంటే కొత్త కొత్త వాచీలు కొనడం అంటేనే ఇష్టమని చిరు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి ఆయన ఎప్పుడు బయటకు వచ్చినా వెంటనే అందరి కన్ను చిరు పెట్టుకున్న వాచ్ పైనే పడుతుంది.

చిరు సినిమాల విషయానికి వస్తే…
గతేడాది “వాల్తేరు వీరయ్య” మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరంజీవి ఆ తర్వాత గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలతో రెండు అల్ట్రా డిజాస్టర్లు అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన “విశ్వంభర” అనే సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీతో చిరు మరోసారి తన రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. యూవీ క్రియేషన్స్ దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ దసరా వరకు కంప్లీట్ చేసి, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. 2025 జనవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు.

Check out Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు