Kalki Movie: ప్రభాస్ మూవీ షూటింగ్‌కి మరోసారి బ్రేక్… అంటే మళ్లీ వాయిదానే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో బాక్స్ ఆఫీస్ పై “కల్కి”తో దాడి చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ వాయిదా పడబోతోంది అని గత కొన్ని రోజులుగా వార్తలు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకొనే బయటపెట్టిన గుడ్ న్యూస్ “కల్కి”కి బాడ్ న్యూస్ కాబోతోందా? అనే సందేహాలు మొదలయ్యాయి. అదే నిజమైతే ప్రభాస్ మూవీకి మరోసారి బ్రేక్ తప్పదు. అంటే మళ్ళీ వాయిదానే అన్నమాట.

మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి”
దేశవ్యాప్తంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రభాస్ “కల్కి 2989 AD” అనేది మోస్ట్ అవైటెడ్ మూవీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ మూవీపై అంచనాలు రేంజ్ లో ఉన్నాయి. “మహానటి” వంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ పై ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగా ఉన్నాయి. టైం ట్రావెలర్ థీమ్ తో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు డార్లింగ్ ఫాన్స్.

Prabhas movie Kalki 2898 AD shooting break once again

- Advertisement -

ఇప్పటికే ఈ చిత్రం మహాభారతం నుంచి మొదలుకొని 2898 వరకు ఉంటుందని, 6000 సంవత్సరాల మధ్య జరిగిన కథ అని హింట్ ఇచ్చి హైప్ పెంచేశాడు నాగ్ అశ్విన్. వేసవి కానుకగా మే 9న “కల్కి” మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే “కల్కి” మూవీ మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీపిక పదుకొనే అందించిన గుడ్ న్యూస్ తో మరోసారి “కల్కి” వాయిదా? తప్పదా అని చర్చ మొదలైంది.

దీపికా గుడ్ న్యూస్ “కల్కి”కి బ్యాడ్ న్యూసా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే “కల్కి” మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ బ్యూటీ తను తల్లి కాబోతున్నాననే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వార్త “కల్కి”పై కొత్త అనుమానాలకు తెరతీసినట్టు అయింది. ఈ మూవీలో దీపిక లేడీ వారియర్ గా కనిపిస్తారని అంటున్నారు. మరి ఇప్పటికే దీపిక పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందా? లేదంటే ఆమె ప్రెగ్నెన్సీ తోనే షూటింగ్లో పాల్గొంటుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒకవేళ దీపిక పార్ట్ షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వకపోతే సినిమాకు బ్రేక్ పడే అవకాశం ఉందా? అనే చర్చ మొదలైంది. ఒకవేళ అదే గనక నిజమైతే “కల్కి” వాయిదా పడక తప్పదు అంటున్నారు.

ఇప్పటి వరకు ఎన్ని సార్లు వాయిదా పడిందంటే..? 
నిజానికి “కల్కి” మూవీని 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాల్సి ఉంది. కానీ డిసెంబర్ 23న థియేటర్లలోకి “సలార్” రావడంతో, “కల్కీ” వాయిదా పడింది. ఆ తరువాత మే 9న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమాకు అవసరమైన వీఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ కారణంగా ఈసారి కూడా “కల్కి” మూవీ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే మేకర్స్ మాత్రం వాటిని కొట్టి పడేస్తూ మే 9న “కల్కి” ఆగయా అంటూ మరోసారి కన్ఫర్మ్ చేశారు.

Prabhas movie Kalki 2898 AD shooting break once again

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood newsMovie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు