Ram Charan: అంబానీ ఇంట మెగా జంట.. ఫ్రేమ్ అదిరిందిగా..!

రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసి..ఈ సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్లడంతో రామ్ చరణ్ పేరు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. అందుకే ఎక్కడ ఏ ఈవెంట్ జరిగినా రామ్ చరణ్ ను అలాగే ఆయన సతీమణి ఉపాసనను ముఖ్య అతిథులుగా ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒకరైన అంబానీ ఇంట పెళ్లి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో మెగా జంట ఉపాసన , రాంచరణ్ లకు ప్రత్యేక ఆహ్వానం అందడం ఇప్పుడు వైరల్ గా మారింది. ముఖ్యంగా ఇంటర్నేషనల్ స్టార్స్ పాల్గొనబోయే ఈ ఈవెంట్లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీ సమేతంగా సందడి చేయబోతుండడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అంబానీ ఇంట మెగా జంట..
రామ్ చరణ్ , ఉపాసన దంపతులు అంబానీ ఇంట సందడి చేయబోతున్నారు.. అంబానీ కొడుకు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కి వెళ్ళబోతున్నట్లు సమాచారం. అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో వీరు సందడి చేయబోతున్నారట.. ఈ కపుల్స్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గుజరాత్ జమ్ నగర్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.. ఇప్పటికే ఫిబ్రవరి 28న స్టార్ట్ అయిన ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి వరుసగా ఒక్కొక్కరు హాజరవుతున్నారు.

అంబానీ ఇంట పెళ్లికి హాజరయ్యే టాప్ సెలబ్రిటీస్..
ఇక ప్రపంచవ్యాప్తంగా వీరికి ఉన్న పలుకుబడి కారణంగా పలువురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు కూడా హాజరు కాబోతున్నారట. అందులో భాగంగానే ఇప్పటికే వరల్డ్ టాప్ పాప్ సింగర్ రిహాన్న, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ వంటి ఇంటర్నేషనల్ పర్సన్స్ కూడా ఇండియాలో ఇప్పటికే ల్యాండ్ అయ్యారు.. ముఖ్యంగా ఈ ప్రీ వెడ్డింగ్ గ్లోబల్ వైడ్ గా వైరల్ అవుతుంది. ఇండియాలోని టాప్ స్టార్స్ అందరికీ కూడా ఇన్విటేషన్ లభించగా.. అందులో ప్రముఖ రాజకీయ నాయకులు , బాలీవుడ్ స్టార్ట్స్ తో పాటు టాలీవుడ్ స్టార్స్ కూడా సెలబ్రేషన్స్ కి గెస్ట్ లుగా హాజరవుతున్నారు.

- Advertisement -

పెళ్లికి హాజరయ్యే ఇండియన్ సెలబ్రిటీస్ వీళ్లే..
ఈ పెళ్లికి ఇండియన్ సెలబ్రిటీస్ తరఫున బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ , తన ఫ్యామిలీతో కలిసి ఇప్పటికే జమ్ నగర్ చేరుకున్నారు. ఈ స్టార్ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ ఆయన సతీమణి ఉపాసనకు ప్రత్యేకంగా ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఇకపోతే వీళ్లిద్దరూ కూడా ఈవెంట్ కి వెళ్ళబోతున్నట్లు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక మిగతా వారి విషయానికి వస్తే.. సంగీత్ ఫంక్షన్ తో మొదలవుతున్న ఈ సెలబ్రేషన్స్ లో రిహాన్న మ్యూజిక్ కాన్సర్ట్ ఇవ్వబోతున్నారు.. ఇందుకోసం కాన్సర్ట్ కి కావాల్సిన భారీ మ్యూజిక్ పరికరాలు ఇండియాకి చేరుకున్నాయి.. అలాగే ఈవెంట్స్ కి ఒక్కొక్కరిగా సెలబ్రిటీలు హాజరవుతూ ఉండడం గమనార్హం.. ఇక షారుఖ్ ఖాన్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా ఇక్కడ సందడి చేయబోతున్నారట. అంతేకాదు తమ ఆటపాటలతో అక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ ని అలరించబోతున్నట్లు సమాచారం.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు