తెలుగు సినీ పరిశ్రమలోకి కన్నడ హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చి బాగానే సక్సెస్ అవుతున్నారు.. అలాంటివారిలో రష్మిక కూడా ఒకరు.. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ ను అందుకుంది.. పుష్ప, యానిమల్ సినిమాలతో రష్మిక పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పాన్ ఇండియా చిత్రాలు మాత్రమే వుండడం గమనార్హం. ఇకపోతే సోషల్ మీడియాలో కానీ ఇతర ప్రాంతాలలో కానీ రష్మిక క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
బ్రాండ్ అంబాసిడర్ గా..
సౌత్ టు నార్త్ తో వరుస హిట్లు అందుకుంటూ పాన్ ఇండియన్ హీరోయిన్ గా దూసుకుపోతోంది.. ఇప్పుడు నేషనల్ లెవెల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు రష్మిక పేరైతే బాగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె జపాన్ బ్రాండ్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అక్కడ జపాన్ లో రష్మిక పోస్టర్స్ ని చూసి అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.. పుష్ప సినిమాతో రష్మికాకు జపాన్ లో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.. జపాన్ కి చెందిన టాప్ ఫ్యాషన్ బ్రాండ్ లలో ఒకటైన Onitsuka బ్రాండ్ కి రష్మిక బ్రాండ్ అంబాసిడర్ గా గత ఏడాది ఎంపికయింది.
ఎమోషనల్ అయిన రష్మిక..
ఈ బ్రాండ్ కు సంబంధించి పలు రకాల ప్రమోషన్స్, ఫ్యాషన్ ఈవెంట్లో కూడా రష్మిక పాల్గొనడం జరిగింది. ఈ క్రమంలోని ఇటీవల ఇటలీలో జరిగిన మరొక ఫ్యాషన్ ఈవెంట్లో రష్మిక గెస్ట్ గా వెళ్లారు.. అలా ఈవెంట్ కి వెళ్లిన సమయంలో నిన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి జపాన్ కు చేరుకున్న రష్మిక కి అభిమానులు సైతం చాలా గ్రాండ్గా వెల్కమ్ తెలియజేశారు. ఇది చూసిన రష్మిక ఒక్కసారిగా ఎమోషనల్ గా అయినట్టు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జపాన్లో ఘన స్వాగతం..
జపాన్ రాజధాని టోక్యోలో రష్మిక ఫ్యాన్స్ ఆమె పోస్టర్ ను పట్టుకొని స్వాగతం పలుకుతున్నట్టు ఈ వీడియోలో చూపించారు.. ఈ వీడియో చూసిన రష్మిక అభిమానులు నేషనల్ క్రష్ పాన్ ఇండియన్ హీరోయిన్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఒకపక్క బ్రాండ్ ప్రమోషన్ చేస్తూనే .. విదేశాలను చుట్టేస్తున్న రష్మిక మరొకపక్క సినిమా షూటింగులతో బిజీగా ఉన్నది..
National crush @iamRashmika was warmly welcomed by her fans in Tokyo❤️#RashmikaMandanna #Pushpa2TheRule pic.twitter.com/lFWbaQLpvm
— Suresh PRO (@SureshPRO_) March 1, 2024
రష్మిక నటిస్తున్న సినిమాలు..
రష్మిక నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప టు లో కూడా నటిస్తోంది వీటితోపాటు మరో రెండు చిత్రాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఈమె నటించిన మూడు పాన్ ఇండియా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ సినిమాలు హిట్టయితే ఇక ఈమె రేంజ్ భారీగా పెరిగిపోతుంది అనడంలో సందేహం లేదు.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify