Ikigai Life style : జపాన్ వాళ్ళ ఆయుష్షు 100 కంటే ఎక్కువే… ఇవే ఆ సీక్రెట్స్

నిండు నూరేళ్లు దీర్ఘాయుష్షుతో బ్రతకండి అంటూ ఆశీర్వదిస్తారు పెద్దలు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆయుర్దాయం అనేది తరతరానికి తగ్గిపోతూనే ఉంది. ముఖ్యంగా ఇండియాలో అయితే 70 ఏళ్లు బతికితే అదే ఓ వింత అన్నట్టుగా మారిపోయింది. ఇలా ఆయుష్షు తగ్గిపోవడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందులో లైఫ్ స్టైల్ కూడా ఒకటి. ఒకప్పుడు ఆరోగ్యం కోసం తినేవాళ్లు. కానీ ఇప్పుడు ఉన్నన్ని రోజులు నచ్చింది తిని బ్రతికేద్దాం అన్నట్టుగా ఉన్నారు జనాలు. మరోవైపు కలుషిత వాతావరణం, ఉరుకులు పరుగుల జీవితం, ఈ ఆధునిక జీవనశైలి కారణంగా 40 ఏళ్లకే ఏజ్ మీద పడిపోతోంది. కానీ జపాన్ ప్రజలు మాత్రం Ikigai లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ 100 ఏళ్లకు పైనే బ్రతుకుతూ ప్రపంచం అంతా తమ వైపుకు చూసేలా చేస్తున్నారు.

జపనీస్ ఆయుష్షు ఎక్కువే…

Ikigai Lifestyle secrets
ప్రపంచ దేశాలతో పోలిస్తే జపాన్లోని ప్రజలు సగటున 84 ఏళ్లకు పైగానే జీవిస్తున్నారు. ఇక అక్కడి ఒకినావా ద్వీపంలో మాత్రం ప్రతి ఇంట్లోనూ వందేళ్లు దాటిన వాళ్లు ఉండడం విశేషం. పైగా ఆ పండు ముసలి ఏజ్ లో కూడా యాక్టివ్ గా ఉంటూ, చేతనైన పనులు చేస్తారు. దీనికి కారణం వాళ్లు నమ్మే ఇకిగాయ్ కాన్సెప్ట్. ఇకి అంటే లైఫ్, గాయ్ అంటే పర్పస్ అని అర్థం. అంటే జీవితానికి ఒక పర్పస్ ఉంటుందని అర్థం చేసుకోవాలనేదే ఈ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ పై IKIGAI : the Japanese secret to a long and happy life అనే బుక్ రాగా, ఇంటర్నేషనల్ మార్కెట్లో బెస్ట్ సెల్లర్ గా సంచలనం సృష్టించింది. ప్రానేస్క్ మిరాలేస్, హెక్టార్ గ్రేషియా ఒకినావాకి వెళ్లి అక్కడి ప్రజల జీవనశైలిని అధ్యయనం చేసి, ఆ తర్వాత పుస్తకం రూపంలో ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో వందేళ్ల పాటు అక్కడి ప్రజలు సంతోషంగా ఎలా జీవిస్తున్నారు? వాళ్ళు ఏం తింటున్నారు? వాళ్ల ఆయుష్షు వెనుక ఉన్న రహస్యం ఏంటి? అనే ఆసక్తికరమైన అంశాలన్నీ పొందుపరిచారు.

- Advertisement -

ఈ రూల్ కంపల్సరీ
ఒకినావా ద్వీప ప్రాంత ప్రజలు ఎంత ఆకలి వేసినా సరే 80% మాత్రమే కడుపు నింపుకుంటారు. మిగతా 20 శాతం పొట్టను ఖాళీగా ఉంచేసుకుంటారు. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రూల్ ని ఫాలో అవుతారు. హోటల్లో కూడా ఈ రూల్ కంపల్సరీ. దీనివల్ల డైజేషన్ ప్రాసెస్ అనేది యాక్టివ్ గా ఉండి, తిన్నది సులువుగా జీర్ణం అవుతుంది.

నిత్య యవ్వనానికి సీక్రెట్ డ్రింక్
అక్కడ ప్రజలు Shikuwasa అనే డ్రింక్ ను ఎక్కువగా తాగుతారు. నిమ్మకాయ లాంటి ఫ్రూట్స్ తో తయారు చేసే ఈ డ్రింక్ లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ జ్యూస్ వల్ల బిపి, షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటాయి. ఈ పండ్లను ఎండబెట్టి వాటితో టి కూడా చేసుకుంటారు. అలాగే పేస్ట్ చేసి వంటల్లో వాడుతారు. ఎక్కువగా పండ్లు, కూరగాయలు తింటూ, చక్కెరను చాలా తక్కువగా వాడుతారు.

స్పెషల్ ఎక్సర్సైజ్

Ikigai Lifestyle secrets
జపాన్ ప్రజలు రేడియో ఎక్సర్సైజ్ అనే ప్రత్యేకమైన వ్యాయామానికి ప్రాధాన్యతని ఇస్తారు. అందరూ కలిసి యూనిటీగా ఈ వ్యాయామం చేస్తారు. చేతుల్ని గుండ్రంగా తిప్పడమే దీని స్పెషాలిటీ.

క్లారిటీ
ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనే క్లారిటీ తోనే ముందుకు వెళ్తారు. వీలైనంతవరకు సంతోషంగా ఉంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు